సినిమా వాళ్ళతో జూ ఎన్టీఆర్ పెళ్ళి ఏర్పాట్లు
జూనియర్ ఎన్టీఆర్ వివాహానికి నవంబర్ 18నే ఫైనల్ గా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజున ఎన్టీఆర్ నిర్ణయించిన వివాహ ముహూర్తానికి లక్ష్మి ప్రణతికి మూడు ముళ్లు వేయనున్నారు. ఇక ఈ పెళ్ళి నిమిత్తం ఏర్పాట్లు వేగంగా జరిగిపోతున్నాయి. సినీ ఆర్ట్ డైరక్టర్ ఆనంద సాయి ఎన్టీఆర్ కళ్యాణ వేదికను సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఈ కళ్యాణ వేడుక జరగనుంది. అలాగే వివాహానికి సంభదించిన మరికొన్ని పనులుకు కూడా సినిమా వాళ్లనే పురమాయిస్తున్నారు. గ్రాండ్ లా సినిమా పెళ్ళిళ్ళలను మించేలా ఈ వివాహం ఉండాలని పనులు చేస్తున్నారు.
ఇక నవంబర్ 18నే వివాహానికి ఎంచుకోవటానికి కారణం...ఎన్టీఆర్ కు లక్కీ నెంబర్ 9 కావటమేనంటున్నారు. పట్టుబట్టి ఎన్టీఆర్ తన మ్యారేజ్ డేట్ కూడా 9 వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ఒకటికు ఎనిమిది కలిపితే..తొమ్మిదికదా..అందుకే నవంబర్..18 డేట్ గా ఫిక్సయ్యారని తెలుస్తోంది. అలాగే వివాహ నిశ్చితార్ధం ఏప్రియల్ ఒకటిన హోటల్ నొవొటల్, హైదరాబాదులో కన్నుల పండుగగా జరిగింది.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా 'బృందావనం"(గోవిందుడు అందరి వాడేలే) చిత్రం చేస్తున్నారు. ఇందులో జూ ఎన్టీఆర్ సరసన కాజల్, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి చిత్రంలోనూ చేస్తున్నారు. ఇందులో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











