ఎన్టీఆర్ దృష్టి మొత్తం ఆ హీరోపైనే
జూ.ఎన్టీఆర్ ఇప్పుడు తన కాన్సర్టేషన్ మొత్తం మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ చిత్రం మీదే పెట్టారని టాక్. దానికి కారణం ..మహేష్ తో పోటీ పడటం ఒకటి..మరొకటి..తన తర్వాత చిత్రం పూరి తో కమిటవ్వటం గురించి. మహేష్ తన చిత్రం దూకుడుతో టాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చెయ్యటంతో దాన్ని బ్రేక్ చెయ్యాలనే ఎన్టీఆర్ ఆలోచనలో ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తన చిత్రం దమ్ముతో తన ఆశ నెరవేరుతుందని భావిస్తున్నాడు. ఇది ఆరోగ్యవంతమైన పోటీలో భాగం అని సీనియర్స్ అంటున్నారు. అలాగే ఎన్టీఆర్..ఇప్పుడు మహేష్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ ని పరిశీలిస్తున్నారు. ఆ చిత్రం మార్కెటింగ్ స్టాటజీ,వస్తున్న క్రేజ్,ధియోటర్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేయిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు.
బిజినెస్ మ్యాన్ చిత్రం టాలీవుడ్ పై ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అన్నది ఎన్టీఆర్ తాజా అప్ డేట్స్ తో తెలుసుకుంటున్నారు. ఇక దమ్ము చిత్రం కూడా చాలా బాగా వస్తున్నట్లుగా తెలుస్తోంది. దమ్ములో ఎన్టీఆర్ సరనస త్రిష,కార్తీక చేస్తున్నారు. ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వినికిడి. బోయపాటి తనదైన శైలిలో పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణకు సింహాతో సూపర్ హిట్ ఇచ్చినట్లే తనకూ ఆ రేంజిని దాటే చిత్రం వస్తుందని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ ఊహించిన విధంగా ఊసరవెల్లి ఆడకపోవటంతో వచ్చిన నిరాశను దమ్ము దుమ్మురేపి తుడిచేస్తుందని ఆసిద్దాం.


Click it and Unblock the Notifications











