ఎన్టీఆర్ మూవీని రామ్ చరణ్ నిర్మించబోతున్నారా?

Recommended Video

Ram Charan Producers NTR's Movie...?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.... ప్రతి విషయంలోనూ చాలా పర్ఫెక్టుగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటు హీరోగా తన సినిమాలు చేసుకుంటూ, ఫిట్ నెస్ కాపాడుకుంటూ... నటుడిగా సక్సెస్ అందుకుంటున్నారు. మరో వైపు 'కొణిదెల ప్రొడక్షన్స్' పేరుతో సొంత బేనర్ స్థాపించి 'సైరా నరసింహారెడ్డి' లాంటి భారీ ప్రాజెక్టులను తెరకెక్కిస్తున్నారు.

'కొణిదెల ప్రొడక్షన్స్' బేనర్లో తెరకెక్కిన తొలి చిత్రం 'ఖైదీ నెం. 150' సంచలన విజయం అందుకోగా.... ఇపుడు దాదాపు రూ. 150 నుండి రూ. 200 కోట్ల ఖర్చుతో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'సైరా' లాంటి పీరియడ్ మూవీని కనివీని ఎరుగని రీతిలో నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్ హీరోగా కొణిదెల ప్రొడక్షన్ మూవీ

ఎన్టీఆర్ హీరోగా కొణిదెల ప్రొడక్షన్ మూవీ

అయితే తన సొంత బేనర్లో కేవలం తమ మెగా ఫ్యామిలీ హీరోలతోనే కాకుండా బయటి హీరోలతో కూడా సినిమాలు చేయాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారట. ‘కొణిదెల ప్రొడక్షన్స్' బేనర్లో చేయబోయే తొలి బయటి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటూ తాజాగా ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది.

 ఎన్టీఆర్ ఓకే చెప్పాడా?

ఎన్టీఆర్ ఓకే చెప్పాడా?

రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి త్వరలో రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు కూడా. రామ్ చరణ్ తన బేనర్లో సినిమా చేయాలని ఎన్టీఆర్‌ను అడగటం, యంగ్ టైగర్ సూచన ప్రాయంగా ఓకే చెప్పడం జరిగిపోయిందట.

 మంచి పరిణామం

మంచి పరిణామం

టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్...... ఒకరి బేనర్లో ఒకరు సినిమాలు చేయడం ద్వారా మరింత బలపడుతుందని, ఇది ఇండస్ట్రీకి మంచి పరిణామం అనే వాదన కూడా కొందరి నుండి వ్యక్తం అవుతోంది.

వర్కౌట్ కాక పోవచ్చు?

వర్కౌట్ కాక పోవచ్చు?

ఒక స్టార్ హీరో నిర్మాణ సంస్థలో మరొక స్టార్ హీరో సినిమా చేయడం అనే కాన్సెప్టు బాగానే ఉంది. ఇలా వచ్చిన సినిమా విజయం సాధిస్తే మరింత బావుంటుంది. ఒక వేళ అదృష్ణం కలిసిరాక సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడితే హీరోల మధ్య మాత్రమే కాదు.... వారి అభిమానుల మధ్య కూడా ఫ్రెండ్షిప్ చెడిపోయే అకవాశం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X