మెగా కాంపౌండ్‌లోకి ఎన్టీఆర్: బన్నీతో కలిసి భారీ ప్రాజెక్టు.. సంచలనంగా మారిన తాజా లీక్

ఎన్టీఆర్ మనవడిగా సినీ రంగ ప్రవేశం చేసి.. అనతి కాలంలోనే ఎవరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోయిన హీరో జూనియర్ ఎన్టీఆర్. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, పాటలు ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే గ్లోబల్ రేంజ్‌కు కూడా ఎదిగిపోయాడు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు వరుసగా ఎన్నో సినిమాలను లైన్‌లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే అతడు మెగా కాంపౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడట. ఆ వివరాలు మీకోసమే!

ఇంటర్నేషనల్ రేంజ్ క్రేజ్:వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్న జూనియర్ ఎన్టీఆర్.. గత ఏడాదిలో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో వచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది. అలాగే, తారక్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తీసుకొచ్చి అతడని పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. అంతేకాదు, దీనితో అతడి రేంజ్ ఇంటర్నేషనల్‌ లెవెల్‌కు చేరింది.

 Jr NTR

దేవరగా మారిపోయిన తారక్: RRR చేస్తున్నప్పుడే ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. 'దేవర' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతూ 40 శాతం వరకూ కంప్లీట్ అయిపోయింది.

 Jr NTR

కేజీఎఫ్ డైరెక్టర్‌తో సినిమా: వరుస సక్సెస్‌లతో జోష్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని గత ఏడాదే అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతుంది. దీనిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ: వరుసగా సినిమాలను ఓకే చేసుకుంటోన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. స్పై థ్రిల్లర్ సిరీస్‌గా వచ్చిన 'వార్' సీక్వెల్‌లో నటించబోతున్నాడు. 'వార్ 2' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో తారక్.. బాలీవుడ్ బడా హీరో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కించబోతున్నాడు.

 Jr NTR

చాలా మంది డైరెక్టర్లతోనూ: ప్రస్తుతం ఎన్నో సినిమాలను చేసేందుకు కమిట్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు మరికొందరితోనూ కథాపరమైన చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇప్పటికే పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో అతడి పేరు హైలైట్ అయిపోతోంది.

మెగా కాంపౌండ్‌లో తారక్:RRRతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో భారీ ప్రాజెక్టులకు ఫస్ట్ చాయిస్ అవుతున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ బడా హీరో మెగా కాంపౌండ్‌కు చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్టుకు చేయబోతున్నాడని తాజాగా న్యూస్ లీకైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని కూడా అంటున్నారు.

నిర్మాతగా అల్లు అర్జున్: గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించబోయే సినిమాను అల్లు అరవింద్ కాకుండా అల్లు అర్జున్ నిర్మించబోతున్నాడట. ఈ చిత్రంతోనే అతడు నిర్మాతగా ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది. అంత హై రేంజ్‌లో ఈ ప్రాజెక్టు ఉండబోతుందని అంటున్నారు. దీంతో ఇప్పుడీ న్యూస్ టాలీవుడ్‌లో సంచలనంగా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X