twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నతో ఎన్టీఆర్ డీలింగ్.. ఇకపై ఒక్కటిగా కొత్త బిజినెస్!

    |

    నందమూరి వంశంలో అందరికంటే ఎక్కువ మార్కెట్ తో దూసుకుపోతున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. ఒకప్పుడు బాలకృష్ణ తనదైన శైలిలో బాక్సాఫీస్ హిట్స్ ని అందుకున్నప్పటికి ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టు హిట్స్ అందుకుంటున్న హీరో మాత్రం జూనియర్ ఎన్టీఆర్. ఇక అన్న కళ్యాణ్ రామ్ కి కూడా అప్పుడప్పుడు తన క్రేజ్ ఉపయోగపడేలా చేస్తున్నాడు తారక్.

    ఆ సినిమాతోనే..

    ఆ సినిమాతోనే..

    జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యుల గురించి బయట ఏ స్థాయిలో చెప్పుకుంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇంకా ఆ కుటుంబంలో మనస్పర్థలు తగ్గలేవని అప్పుడప్పుడు కొన్ని రూమర్స్ వస్తుండేవి. కానీ ఎప్పుడైతే తారక్ జై లవకుశ సినిమా చేశాడో అప్పటి నుంచి నందమూరి బ్రదర్స్ లో ఎలాంటి విబేధాలు లేవని ఒక క్లారిటీ వచ్చింది.

     మరోసారి అదే కాంబినేషన్..

    మరోసారి అదే కాంబినేషన్..

    కళ్యాణ్ రామ్ స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించడానికి చాలా కాలం పట్టింది. మొత్తానికి జై లవ కుశ సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్నారు. ఆ సినిమా తరువాత అంతకంటే ఎక్కువ స్థాయిలో హిట్టు అందుకోవాలని కళ్యాణ్ రామ్ ..తమ్ముడితో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ కథ సెట్ చేయగా అన్న కాంబినేషన్ లోనే మరో సినిమా చేసేందుకు తారక్ సిద్ధమయ్యాడు. అలాగే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా ఇదే సంస్థలో చేయాలని అనుకుంటున్నారట.

     అన్నతో కొత్త బిజినెస్..

    అన్నతో కొత్త బిజినెస్..

    కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో జై లవకుశ సినిమా కంటే ముందు వరకు ఆ బ్యానర్ లో కేవలం కళ్యాణ్ రామ్ మాత్రమే సినిమాలు చేశాడు. ఇక ఎన్టీఆర్ కలిసిన తరువాత ఆ బ్యానర్ స్థాయి పెరిగింది. ఇక నుంచి వీలైనంత వరకు జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్య బ్యానర్ లోనే ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు. సినిమాల్లో తను కూడా కొంత ఈన్వెస్ట్ చేసి కొత్త తరహాలో బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడట.

    Recommended Video

    #Betherealman: Why Mahesh Babu, Pawan Kalyan, Prabhas Are Not In Challenge ?
    మరొక బ్యానర్ లేనట్లే..

    మరొక బ్యానర్ లేనట్లే..

    అసలైతే జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా ఒక బ్యానర్ స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు అప్పట్లో ఒక టాక్ వచ్చింది. కానీ ఫైనల్ గా కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ హౌజ్ తోనే కలిసి సినిమా చేయాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడు. ఒక్కటిగా సినిమాలు నిర్మించి తన ఆదాయాన్ని కూడా పెంచుకోవాలని అలాగే అన్నకు కూడా హెల్ప్ చేయాలని తారక్ డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తరువాత కూడా మరో రెండు సినిమాలు ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే తెరకెక్కే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

    English summary
    Once he completes RRR, he will work with Trivikram and then he has a film lined up with KGF fame Prashanth Neel. This film will be produced by NTR Arts and now the latest gossip going around is that NTR has decided to do most of his films in NTR Arts in the days to come and will be collaborating with other banners in this regard.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X