జూనియర్ ఎన్టీఆర్ మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. కొనసాగుతున్న కన్ఫ్యూజన్.. అసలు నిజం తెలిసేది ఆ రోజే!

సినిమా ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ అనేలా బిగెస్ట్ మల్టీస్టారర్ సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా RRR సినిమా కోసం ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా అనంతరం సౌత్ లోనే మరో బిగెస్ట్ మల్టీస్టారర్ రానున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో మరో తమిళ అగ్ర హీరో నటిస్తారని సమాచారం. ఇక ఆ విషయంలో క్లారిటీ రావాలి అంటే ఒక డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే అనే రూమర్ వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ ఫీనిషింగ్ టచ్

ఎన్టీఆర్ ఫీనిషింగ్ టచ్

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. కొమురం భీమ్ పాత్రలో తారక్ నెవర్ బిఫోర్ అనేలా కనిపించబోతున్నాడు. ఫిట్నెస్ లో కూడా చాలా మార్పులు చేసినట్లు టీజర్ తోనే అర్ధమయ్యింది.

పాన్ ఇండియా రేంజ్ లో..

పాన్ ఇండియా రేంజ్ లో..


ఇక RRR అనంతరం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో మరొక సినిమాను స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. 30వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలని అనుకున్నాడు. కానీ RRR తరువాత చేయబోయే సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండాలని ప్లాన్ చేశారు.

ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఎలాంటి క్లారిటీ రాలేదు.


అయితే తమిళ్ లో కూడా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో అట్లీ చర్చలు జరుపుతున్నాడు. అయితే ఆ సినిమాలో విజయ్ కూడా నటించవచ్చని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఇరు వైపుల నుంచి అయితే ఎలాంటి క్లారిటీ రాలేదు.

 మరొక కొత్త గాసిప్

మరొక కొత్త గాసిప్

ఇక ఈ బిగ్గెస్ట్ కాంబినేషన్ పై అప్డేట్ ఇవ్వడానికి ఒక డేట్ అయితే సెట్ చేసుకున్నట్లు మరో కొత్త గాసిప్ వైరల్ గా మారింది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ సినిమాపై కూడా ఒక క్లారిటీ రావచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఎన్టీఆర్ బర్త్ డే వరకు వేయిట్ చేయాల్సిందే. ఇక విజయ్ కూడా మాస్టర్ అనంతరం తెలుగు మార్కెట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఛాన్స్ వస్తే తప్పకుండా టాలీవుడ్ హీరోతో సినిమా చేయడానికి ఒప్పుకుంటాడాని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X