ఎన్టీఆర్ కొత్త షో వివరాలు లీక్: ‘MEK’ కాదు.. పేరు మార్చిన టీమ్.. ఆ గెస్టుతో అప్పటి నుంచే ప్రారంభం!

దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, పాటలు ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇక, ఇటీవలి కాలంలో వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతోన్న తారక్.. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూడా అద్భుతమైన హోస్టింగ్‌తో అదరగొట్టేశాడు. ఈ క్రమంలోనే మరో కొత్త షోతో టెలివిజన్ ఆడియెన్స్‌ను అలరించబోతున్నాడు. తాజాగా లీక్ అయిన ఆ షో పూర్తి వివరాలు మీకోసం!

ఏకంగా ఐదు విజయాలు అందుకున్నాడు

ఏకంగా ఐదు విజయాలు అందుకున్నాడు


ఆ మధ్య ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' అతడు హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని తారక్.. ఆ తర్వాత వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్లను ఖాతాలో వేసుకున్నాడు.

టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్టర్లతో సినిమాలు

టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్టర్లతో సినిమాలు

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు.

బుల్లితెరపై అలా.. మొదటిదే సూపర్ హిట్

బుల్లితెరపై అలా.. మొదటిదే సూపర్ హిట్

బుల్లితెరపై ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. దీని మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగులో ఇది సక్సెస్ అవడంతో అతడి పాత్ర చాలా ఉంది. ఎన్నో అనుమానాల నడుమ కొత్త కంటెంట్‌తో వచ్చిన ఈ షోను.. అద్భుతమైన హోస్టింగ్‌తో హిట్ చేశాడు. అయితే, ఆ తర్వాత దీని నుంచి తప్పుకున్నాడు.

మరోసారి టెలివిజన్‌లో యంగ్ టైగర్ సందడి

మరోసారి టెలివిజన్‌లో యంగ్ టైగర్ సందడి

సుదీర్ఘ విరామం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నాడు. జెమినీలో ప్రసారం కానున్న ఓ షోతో అతడు టెలివిజన్ రంగంలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వర్క్ కూడా ఎప్పుడో ప్రారంభం అయింది. ఇక, ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమోను కూడా రెడీ చేశారు. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు.

‘MEK’ కాదు.. పేరు మార్చిన నిర్వహకులు

‘MEK’ కాదు.. పేరు మార్చిన నిర్వహకులు

స్టార్ మాలో ప్రసారం అయిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఇది ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇందులో మొదటి మూడింటికీ నాగార్జున.. నాలుగో దానికి చిరంజీవి హోస్టులుగా చేశారు. ఇప్పుడిదే షోను జెమినీలో ప్రసారం చేయబోతున్నారు. ఎన్టీఆర్ నడిపించే ఈ షోకు పేరు మార్చి 'ఎవరు మీలో కోటీశ్వరుడు' అని పెట్టారని సమాచారం.

తారక్ కొత్త షో మొత్తం వివరాలు బయటకు

తారక్ కొత్త షో మొత్తం వివరాలు బయటకు

ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభం అయిన జూనియర్ ఎన్టీఆర్ కొత్త షో గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఈ షో మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభం అవుతుందట. అంతకు ముందే అంటే మార్చిలోనే ఈ షో ప్రోమోను వదులుతారని తెలుస్తోంది. ప్రారంభం ఎపిసోడ్‌కు పెద్ద స్టార్‌ను తీసుకొచ్చేందుకు ప్లాన్లు జరుగుతున్నాయట.

ఈ సీజన్‌లో ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయంటే!

ఈ సీజన్‌లో ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయంటే!

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్న 'ఎవరు మీలో కోటీశ్వరుడు' షో వారంలో ఐదు రోజులు (ఆదివారం నుంచి గురువారం వరకు) ప్రసారం అవుతుందని తెలుస్తోంది. మొత్తం 60 ఎపిసోడ్లు ఈ షో నడుస్తుందని సమాచారం. ప్రతి రోజూ రాత్రి 9 గంటల నుంచి 10.30 గంటలకు ఇది ప్రసారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఆదివారం స్పెషల్ గెస్ట్ ఎంట్రీ ఉంటుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X