‘KGF’ డైరెక్టర్‌తో కాదు.. ఎన్టీఆర్ తర్వాతి సినిమా ఎవరితోనో క్లారిటీ వచ్చేసింది
Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ప్రస్తుతం 'RRR'లో నటిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ కొమరం భీంగా కనిపించనుండగా, రామ్ చరణ్ మాత్రం అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తారక్ చేయబోయే సినిమాపై కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా దీనిపై ఓ వార్త బయటకు వచ్చింది.

‘KGF' డైరెక్టర్‌తో సినిమా అంటూ ప్రచారం
కన్నడలో వచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం అయిన ‘కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో తారక్ తర్వాతి సినిమా ఉంటుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తారక్‌ను డ్యాన్సర్‌గా చూపించడానికి సన్నాహాలు చేస్తున్నాడని, ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్టును కూడా మైత్రీ మూవీస్ సంస్థకు వినిపించేశాడని వార్తలు కూడా వచ్చాయి.

త్రివిక్రమ్‌తో అని కొత్త వార్త
జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసే విషయంపై క్లారిటీ రాలేదు. కానీ, అతడి తర్వాతి చిత్రంపై తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అదే.. తారక్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరోసారి సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమా సమ్మర్ నుంచి స్టార్ట్ కాబోతుందని కూడా ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.

గతంలో ‘అరవింద సమేత'
జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో గత సంవత్సరం ‘అరవింద సమేత.. వీరరాఘవ' అనే సినిమా వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో తారక్ సరసన పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. దీన్ని హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు.

త్రివిక్రమ్.. బన్నీ సినిమా
తారక్ ప్రస్తుతం ‘RRR' షూటింగ్‌తో బిజీగా ఉంటే.. త్రివిక్రమ్ మాత్రం అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడు. ‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఈ సినిమా వస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











