జూ ఎన్టీఆర్ ఇంకా హ్యాపీగా లేరట, బృందావనం తర్వాత మాటలు
జూనియర్ ఎన్టీఆర్ హ్యాపీగా లేరట. బృందావనం సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఆయన ఈ మాటలన్నారు. బృందావనం సినిమాను ప్రమోట్ చేయడానికి సామంత, కాజల్ అగర్వాల్ కాళ్లకు బలపాలు కట్టుకుని ఓ చోటు నుంచి మరో చోటికి తిరుగుతుండగా, జూనియర్ ఎన్టీఆర్ అంతగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. రెండు న్యూస్ చానెళ్లకు మూడు ఇంటర్వ్యూలు మాత్రం టైమ్ ఇచ్చారు. తనకు ఇంకా హ్యాపీగా లేదని ఆయన ఆ ఇంటర్వ్యూల్లో అన్నారు. తన తాత స్థాయికి ఎదగాలని తనకు ఉందని ఆయన అన్నారు. తన తాత ఎన్టీఆర్ హీరో, విలన్ పాత్రలు పోషించారని, నెగెటివ్ పాత్రలు కూడా వేశారని, యువకుడిగా ఉన్నప్పుడే భీష్ముడిగా నటించారని, అలా తనకు విభిన్నమైన పాత్రలు చేయాలని ఉందని తన కోరికను జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











