అతనితో చేయనని తెగేసి చెప్పిన జూ ఎన్టీఆర్
జూ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ తో ఎప్పటినుంచో సినిమా ప్రపోజల్స్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే.అయితే అవి ఇప్పటివరకూ మెటీరియలైజ్ కాలేదు. అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ ని ఎప్రోచ్ అయిన కల్యాణ్ రామ్..తమ ఇద్దరి కాంబినేషన్ లో మల్టి స్టారర్ సినిమా చేద్దామని ప్రపోజల్ పెట్టాడట. అయితే ఎన్టీఆర్ మాత్రం తను ఇప్పుడు మల్టి స్టారర్ చిత్రాలు చేసే ఆలోచన లేదని, సోలో హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా చేసుకుంటే డేట్స్ కేటాయించగలనని చెప్పాడట. దాంతో తనే హీరోగా సినిమా చేయాలా లేక ఎన్టీఆర్ తో సినిమా చేయాలా అన్న ఆలోచనలో పడ్డాట్ట కళ్యాణ్ రామ్. ఇక కళ్యాణ్ రామ్ కి అతనొక్కడే చిత్రం తర్వాత ఇప్పటివరకూ ఒక్క హిట్టూ రాలేదు. రీసెంట్ గా వచ్చిన కత్తి చిత్రం కూడా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











