ఆ విషయంలో మైండ్ సెట్ మార్చుకొన్న జూ ఎన్టీఆర్...!?
ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ శైలి ప్రత్యేకమైనదన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాస్త ఆటమ్ బాంబుల్లాంటి డైలాగ్స్ పేల్చడం కొంత తగ్గించిన ఎన్టీఆర్ 'దమ్ము" చిత్రంతో డైలాగ్స్ లో తన దమ్మేంటో చూపించడానికి రెడీ అయిపోతున్నాడు. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా త్రిష, కార్తీక నటిస్తున్నారు. నవంబర్ 12నుంచి పొల్లాచ్చీలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ మైసూర్ లో జరుపుకోబోతోంది. హై ఓల్టేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయాలని కెఎస్ రామారావు ప్లాన్ చేస్తున్నాడు.
ఎన్టీఆర్ డబుల్ రోల్స్ చేసిన సినిమాల్లో అదుర్స్" ఒక్కటే ఫర్వాలేదనిపించుకుంది. 'ఆంధ్రావాలా", 'శక్తి" సినిమాలు భారీ అంచనాలతో విడుదలై ప్లాప్ అయ్యాయి. అందుకేనేమో ఆ టైపు డబుల్ రోల్స్" ఇకపై చేయనంటున్నాడు. ప్రస్తుతం యూత్ ఫుల్ యాక్షన్ లవ్ స్టోరీస్ తప్ప, ఇంకే సబ్జక్ట్స్ ని వినేది లేదని ఎన్టీఆర్ తెగేసి చెబుతున్నట్టు తెలుస్తోంది. దమ్ము సినిమా విషయంలో బోయపాటి డబుల్ రోల్ తో చాలా సబ్జెక్ట్స్ చెప్పాడనీ, అవన్నీ తిరస్కరణకు గురై, యాక్షన్ ఎంటర్ టైనర్ కథాంశంతో 'దమ్ము" ప్రాజెక్ట్ వర్కవుట్ అయ్యిందనీ టాలీవుడ్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి.
ఇదిలా వుంటే, పీరియాడికల్ సినిమాల విషయంలో జూ ఎన్టీఆర్ తో పాటు, ఇతర యంగ్ హీరోలెవరూ ఇప్పుడు ఆసక్తి చూపడంలేదట. అందుకు కారణం, 'దూకుడు" సక్సెస్సేననీ..కిందామీదా పడి భారీ సినిమాలు చేయడం కన్నా..సింపుల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ చేసుకోవడమే బెస్ట్ అని యంగ్ హీరోలు సైతం మైండ్ సెట్ మార్చుకొని డిసైడ్ అయ్యారని సమాచారం.


Click it and Unblock the Notifications











