ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బేనర్ లో చేస్తానన్నాను కానీ కళ్యాణ్ తో కాదు
జూ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ వారసులకు ఒళ్లుమంట..అందులో మనవళ్లకయిత మరీ ఎక్కువే..తొలుత కళ్యాణ్ రామ్ కు కూడా జూ ఎన్టీఆర్ తో సరిపడేది కాదు. కానీ, చిత్రాలు స్వంతానికి తీసేసరికి స్టార్ డమ్ అంటే ఏమిటో తెలిసింది. జూ ఎన్టీఆర్ కు కొనుగోలుదారులు వస్తారు. చిత్రం తీస్తే ఓపెనింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కళ్యాణ్ రామ్ కు జూ అంటే ఏమిటో అర్థమయ్యింది.
పైగా తమ్ముడు వరుస ఇంట్లోనే బంగారం పెట్టుకుని స్వంత చిత్రంలో నటింపచేసి నాలుగు రాసులు సంపాదించుకుంటే ఎలా ఉంటుందని కళ్యాణ్ రామ్ ఆలోచన రావడం దాన్ని జూ ఎన్టీఆర్ కు చెప్పడం. నువ్వు తీయాలే గాని నేను చేస్తానని మాటియ్యడం అన్ని ఏకబిగిన సాగాయి. అలాగే పనిలో పనిగా బాలయ్య తో తీద్దామని కూడా కళ్యాణ్ ఆలోచన చేసారు..
కాగా తెలుగులో మల్టీస్టారర్ మూవీస్ రావడంలేదని అందరూ అనుకోవడం, మంచి కథ దొరికతే తప్పకుండా చేస్తాం అని మన హీరోలు అనడం, మనం వినడం అలాటైపోయింది. కళ్యాణ్ రామ్ ఒక్కడగు ముందుకేసి బాలకృష్ణ, జూ ఎన్టీఆర్ తో నేను సినిమా తీస్తానడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనికి జూ ఎన్టీఆర్ సిద్దంగా లేడని తెలిసింది. ఎన్. టి. ఆర్ ఆర్ట్స్ బేనర్ లో సినిమా చేస్తాను కానీ కళ్యాణ్ రామ్ తో కలిసి నటించనని ఎన్టీఆర్ చెప్పినట్టు సమాచారం. అయితే ఇది నిజం కాదని వీళ్ళద్దరి కాంబినేషన్ లో తప్పనిసరిగా సినిమా ఉంటుందని కళ్యాణ్ రామ్ సన్నిహితులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ కాంబినేషన్ లో సినిమా రావడం అన్నది డౌటే..


Click it and Unblock the Notifications











