ఊసరవెల్లికి లెగ్త్ ఎక్కువైందంటూ ఫైట్స్ లో కోత..?
జూ ఎన్టీఆర్ 'ఊసరవెల్లి" విడుదలకు ముందు అభిమానులకు ఓ కొత్త యన్టీఆర్ కనిపిస్తాడని, ఏదో ప్రేక్షకులను మెప్పించడానికంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం, అనవసరంగా భారీ ఫైట్స్ చేయడం ఇందులో మీకు కనిపించవు. ప్రతి అంశమూ కథలో భాగంగా వుంటుంది" అన్నవిషయం గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు అదే జరగుతోంది. సినిమాకి లెగ్త్ 2.45నిమిషాలు ఎక్కువైందంటూ ప్రేక్షకులనుండి పసిగట్టిన ఊసరవెల్లి టీమ్..థియేటర్లోల ప్రేక్షకులు జూ ఎన్టీఆర్ డ్యాన్స్ ఇచ్చే ప్రిపవరెన్స్ ఫైట్స్ కి ఇవ్వలేదనిపిస్తోంది. అందికే కాబోలు సినిమా విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సమయంలో ప్రేక్షకులు ఒకింత నిరుత్సాహ పడకుండా అనవసరమైన టైమ్ లో అనవసరమైన ఫైట్స్ ను తొలగిస్తున్నట్టు సమాచారం.
ఎన్టీఆర్ తాజా చిత్రం 'ఊసరవెల్లి" ఇప్పటికీ బాక్స్ ఆఫీసు వద్ద తన హవా కొనసాగిస్తూనే ఉంది . ఈ సినిమా గత వారాంతంలో భారీ ఓపెనింగ్స్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం గురించి ప్రస్తుతం ఓ వార్తా షికారు చేస్తుంది. విషయం ఏమిటంటే, ఈ చిత్రం ప్రదర్శింపబడుతున్న కొన్ని థియేటర్లలో సెకండ్ హాఫ్ లో కొన్ని ఫైట్ సీన్స్ ను కట్ చేయటం లేదా పూర్తిగా తొలగిస్తున్నారన్న దాని గురించి.
తాజా సమాచారం ప్రకారం, 'ఎలంగో ' పాట తర్వాత వచ్చిన ఫైట్, ఇంకా , క్లైమాక్స్ ఫైట్స్ తొలగిస్తున్నట్టు సమాచారం అందుతుంది. అయితే అన్ని థియేటర్లలో ఇదేవిధంగా కట్ చేస్తున్నారా..! అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రధాన పాత్రల్లో ఎన్టీఆర్, తమన్నానటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. సినిమాటోగ్రఫి రసూల్.


Click it and Unblock the Notifications











