'నందమూరి’అనే ఆ అండదండలు లేకపోతే జూ ఎన్టీఆర్ ఎన్ని సక్సెస్ లు సాధించినా ‘విలువ’...!?
నందమూరి కుటుంబ హీరోల మధ్య విభేదాలు ఉన్నాయా? ఉన్నాయనే అంటున్నాయి ఫిలిమ్ నగర్ వర్గాలు. ఇవి బాలకృష్ణ కొత్త చిత్రం పరమ వీర చక్ర సాక్షిగా బయటపడ్డాయి. బాలకృష్ణ 50వ పుట్టిన రోజు వేడుకలతో పాటు కొత్త చిత్రం పరమ వీర చక్ర ప్రారంభోత్సవ వేడుకలోవచ్చిన ప్రముఖుల్లో హీరో జూనియర్ ఎన్టీఆర్, ఆయన తండ్రి, నటుడు హరికృష్ణ, ఇతర నందమూరి హీరోలు కూడా ఉన్నారు. కానీ, ఏ చిన్నపాటి కార్యక్రమం జరిగిన వేదికపై ఉండే జూనియర్..'పరమ వీర చక్ర' వేడుకల్లో మాత్రం అంటీఅంటనట్టు ఉన్నారు. ఈ తండ్రీ కొడులిద్దరూ పూర్తిగా వేదిక కిందనే కూర్చుండి పోయారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా వారు వేదిక వద్దకు వెళ్లకుండానే నేరుగా తిరుగుపయనమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్, ఆయన తండ్రి హరికృష్ణలు ఇలా నడుచుకోవడం పట్ల ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులంతా విస్మయానికి గురి చేసిన విషయం తెలిసిందే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని మర్చినట్లున్నాడు. ఒకప్పుడు నందమూరి కుటుంబం తనని దగ్గరికి తీసుకుంటే చాలని కోరుకునేవాడు. అతని కోరిక నెరవేరింది. నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ కి సముచిత స్థానం కల్పించారు. బాలకష్ణ ను బాబాయ్ బాబాయ్ అని ఎన్టీఆర్ సంభోదించడం చాలా ముచ్చటగా అనిపించేది. కానీ'సింహా" 50 డేస్ ఫంక్షన్ లో బాబాయ్ అని కాకుండా బాలకృష్ణ అని ఎన్టీఆర్ అనడం, షీల్డ్ లు ఇవ్వమన్నప్పుడు పెద్దగా ఆసక్తి కనబర్చక పోవడం, వేదిక మీద కళ్యాణ్ రామ్, తారకరత్న, బాలయ్య తదితరులు ఒక చోట నిలబడితే తను మాత్రం దూరంగా నిలబడడం..ఇవన్నీ ఎబ్బెట్టుగా అనిపించాయి. నార్నే కూతుర్ని పెళ్లి చేసుకుని వందల కోట్లకు అధిపతి అవ్వబోతున్నాడు కదా..ఆ అహంభావంతోనే ఇలానే ప్రవర్తిస్తున్నాడని, 'నందమూరి" అనే ఆ అండదండలు లేకపోతే అతను ఎన్ని సక్సెస్ లు సాధించినా 'విలువ" ఉండదని తెలుసుకోవాలని కూడా కొంతమంది గుసగుసలాడుతున్నట్టు సన్నిహితుల సమాచారం.


Click it and Unblock the Notifications











