ఈ అమ్మాయితో ఎన్టీఆర్ చెట్టాపట్టాల్.. అవాక్కవుతున్న ఫ్యాన్స్.. అసలు విషయం తెలిస్తే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి 'RRR'లో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు.. అందునా బడా డైరెక్టర్ ఉండడంతో ఈ కాంబినేషన్ తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 జూలై 30న విడుదల కాబోతోంది.
ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా.. తారక్‌కు జోడీగా హాలివుడ్ అమ్మాయి డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తుందని చిత్ర యూనిట్ మొదట్లో ప్రకటించింది. అయితే, ఆమె సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ట్వీట్ కూడా చేసింది. ''అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గార్ జోన్స్ ఆర్‌ఆర్‌ఆర్‌లో కొనసాగలేకపోతున్నారు. ఆమె భవిష్యత్ బాగుండాలని ఆశిస్తున్నాం'' అని చిత్ర బృందం ఆ ట్వీట్‌లో పేర్కొంది.

అప్పటి నుంచి ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్ క్లారిటీకి రాలేకపోయింది. అయితే, తాజాగా ఓ హీరోయిన్‌ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఆమెనే హాలీవుడ్ నటి ఎమ్మా రాబర్ట్స్. 'వైల్డ్ లైఫ్', 'నెర్వ్', 'వలంటైన్స్ డే', 'అడల్ట్ వరల్డ్' సహా ఎన్నో సినిమాల్లో నటించిన ఈమెతో రాజమౌళి సంప్రదింపులు జరిపారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నటించడానికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











