సినిమాల నుంచి తప్పుకున్న సమంత.. ఆ స్టార్ హీరో ఫోన్ కాల్‌తోనే మొత్తం మారిపోయింది.!
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో అక్కినేని వారి కోడలు సమంత ఒకరు. 'ఏమాయ చేశావే'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆమె.. మొదటి సినిమాలోనే అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో సత్తా చాటింది. ఆ వెంటనే స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుని భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో తక్కువ వ్యవధిలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ప్రస్తుతం ఆమె ఒప్పుకున్న సినిమాలేవీ లేకపోవడంతో సామ్ రిటైర్మెంట్ తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఓ స్టార్ హీరో ఫోన్ చేశాడని ఒక వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. ఆ సంగతులేంటో చూద్దాం.!

రెండు చోట్లా సత్తా చాటిన సమంత
కొన్నేళ్లుగా సమంత వరుస విజయాలతో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తెలుగుతో పాటు తమిళంలోనూ సత్తా చాటుతోంది. ఇక్కడ ‘అఆ', ‘జనతా గ్యారేజ్', ‘రంగస్థలం', ‘మహానటి', ‘యూటర్న్', ‘మజిలీ', ‘ఓ బేబీ' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించగా, కోలీవుడ్‌లోనూ ‘మెర్సల్', ‘ఇరుంబుతిరై', ‘సూపర్ డీలక్స్'లతో సత్తా చాటింది.

ఏదో అనుకుంటే ఇంకోదే అయింది
సమంత విజయ పరంపరకు ‘జాను'తో బ్రేక్ పడింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96'కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా చేశాడు. ఎన్నో అంచనాల నడమ ఇటీవల విడుదలైన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. ఫలితంగా చిత్ర యూనిట్‌కు నిరాశే ఎదురైంది. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు.

సమంతకు మిగిలింది అదొక్కటే
వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన సమంత రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆమె మరో సినిమాకు సంతకం చేయలేదు. అయితే, డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టేందుకు ఆమె ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్న ఈ సిరీస్‌లో సామ్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తోంది.

సినిమాలకు దూరం కాబోతున్న సామ్
సమంత ఇకపై సినిమాలకు దూరం కాబోతుందని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ‘జాను' ప్రమోషన్ సమయంలో ‘ఇకపై నేను సినిమాల్లో నటించబోనేమో. ఎందుకంటే నా ఫ్యామిలీకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నా. నా కుటుంబాన్ని పెద్దది చేయాలనుకుంటున్నా' అని చెప్పడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది.

సమంతకు స్టార్ హీరో ఫోన్ కాల్
ప్రస్తుతం ఏ సినిమాకూ సంతకం చేయని సమంతకు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ కాల్ చేశాడని తాజాగా ఓ వార్త లీక్ అయింది. దీని ప్రకారం... త్వరలోనే ప్రారంభం కానున్న త్రివిక్రమ్ సినిమాలో నటించేందుకు తారక్.. సమంతకు కాల్ చేశాడట. దీంతో సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వాలనుకున్న సామ్ మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Recommended Video


అతడితో మళ్లీ కలవబోతున్న సామ్
సమంత ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించింది. అందులో జూనియర్ ఎన్టీఆర్‌తోనే నాలుగు సినిమాలు ఉన్నాయి. కెరీర్ ఆరంభంలో చేసిన ‘బృందావనం'తో పాటు ‘రామయ్య వస్తావయ్యా', ‘రభస', ‘జనతా గ్యారేజ్'లలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ చనువుతోనే తన సినిమా కోసం తారక్.. సామ్‌తో మాట్లాడాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











