అరే ఎన్టీఆర్ మళ్ళీ ..
జూనియర్ ఎన్టీఆర్ మరోసారి ఒళ్ళు చేసాడు. ఆ మధ్య యమదొంగ చిత్రం సమయంలో రాజమౌళి కోరక మేరకు స్లిమ్ అయ్యారు. అభిమానులను ఆనందపరిచారు. అయితే ఈ మధ్య యాక్సిడెంట్ సమయంలో బెడ్ మీద ఉండటం, జిమ్ కి వెళ్ళకపోవటం వల్లే ఈ సారి ఇలా ఒళ్లు చేయటం జరిగిందని అంటున్నారు. ఈ విషయం మొన్న ఎన్టీఆర్ బర్తడే కి వెళ్లి కలిసి వచ్చిన వారు మధ్య హాట్ టాపిక్ గా నలిగింది. డాక్టర్ సూచన అనంతరం ఎన్టీఆర్ వ్యాయామాలు మొదలపెట్టి తిరిగి స్లిమ్ అవ్వాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇక అదుర్స్ షూటింగ్ లో పాల్గొనే ఎన్టీఆర్ కి ఈ ఒళ్ళు పెర్గటం వల్ల కంటెన్యుటీ దెబ్బ తింటుందా అన్న సందేహం కొందరు వెళ్ళిబుచ్చారు. అయినా దర్శకుడు వినాయిక్ (ఈయనా ఈ మధ్య పూర్తి స్ధాయిలో స్లిమ్ అయ్యారు) మాత్రం అటువంటిదేమీ ఉండదని కవర్ చేయవచ్చునని చెప్పారని అంటున్నారు. అయినా ఒకటి రెండు నెలల లోపే తిరిగి షేప్ లోకి రావచ్చునని ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనర్ హామీ ఇచ్చారుట. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











