»   » పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లను ఎదుర్కోవడానికి జూ ఎన్టీఆర్ ప్లాన్...

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లను ఎదుర్కోవడానికి జూ ఎన్టీఆర్ ప్లాన్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు తెలుగు పరిశ్రమలో అగ్రశ్రేణి ఫైనాన్షియర్ అయిన శింగనమల రమేష్ ఇప్పడు కాస్తా అట్టర్ ప్లాప్ ప్రొడ్యూసర్ గా ముద్ర వేయించుకున్నాడు. శింగనమల రమేష్ దివాళా తీయడంలో పవన్ కళ్యాణ్ సినిమా 'పులి", మహేష్ 'ఖలేజా"ముఖ్యపాత్ర పోషించాయి. ఈ రెండు సినిమాల మీద 30కోట్ల పైగా నష్టపోయిన శింగనమల రమేష్ ఇప్పుడు దాదాపుగా బయట తిరగడం తగ్గించేశాడు. అయితే శింగనమల రమేష్ కష్టాన్ని తెలుసుకుని అతనికో సినిమా చవకగా చేసి పెట్టాలని జూ ఎన్టీఆర్ చూస్తున్నాడు.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల వల్ల కొంప కొల్లేరయిన నిర్మాతని తాను నిలబెడితే అంతా తన గురించి గొప్పగా చెప్పుకుంటారని జూ ఎన్టీఆర్ ప్లాన్ వేశాడు. బిజినెస్ పరంగా, క్రేజ్ పరంగా, తనకి పోటీదారులైన ఈ ఇద్దరు హీరోలని దాటేశాననిపించుకోవడానికి ఇది బాగా కలిసొస్తుందని యంగ్ టైగర్ అనుకుంటుంన్నాడు. శింగనమల రమేష్ పాలిట పవన్, మహేష్ ఎనిమీస్ అయితే తాను అతనికి ప్రెండ్ అవ్వాలని చూస్తున్నాడు. వాళ్లమీద ఆధిపత్యం చలాయించడం కోసం నిండా మునిగిన శింగనమలతో సినిమా మొదలు పెడితే, తీరా ఆ సినిమా సగంలో ఆగిపోతే జూ ఎన్టీఆర్ మెడకే చుట్టుకుని అవకాశముందని సినీ వర్గాలవారు హెచ్చరిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu