నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ సినిమా.. పొలిటికల్ ఎంట్రీ తర్వాత పట్టాలెక్కిస్తాడట.!

By Manoj

జూనియర్ ఎన్టీఆర్.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోనే స్టార్‌గా వెలుగొందుతున్న హీరో. పేరున్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులను సైతం సంపాదించుకున్నాడు. అదే సమయంలో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న చిత్రాల్లో నటిస్తూ సక్సెస్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తారక్.. తమిళ ఇండస్ట్రీకి చెందిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంతకీ ఎవరా డైరెక్టర్.? పూర్తి వివరాల్లోకి వెళితే...

ఒక్కటి కాదు.. రెండు కాదు.. వరుసగా ఐదు

ఒక్కటి కాదు.. రెండు కాదు.. వరుసగా ఐదు

కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘టెంపర్' నుంచి అతడు వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. దీంతో టాప్ చైర్‌కు చేరువవడంతో పాటు తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకున్నాడు.

 మళ్లీ గట్టిగానే కొట్టాలని.. మెగా హీరోతో కలిసి..

మళ్లీ గట్టిగానే కొట్టాలని.. మెగా హీరోతో కలిసి..

రాజమౌళి - ఎన్టీఆర్ కాంబినేషన్ ఎంత సక్సెస్‌ఫుల్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వీళ్లిద్దరి కలయికలో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ జోడీ RRR కోసం మళ్లీ కలిసింది. మెగా హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్న ఈ మూవీలో తారక్.. కొమరం భీంగా కనిపించనున్నాడు. అలాగే ఎంతో మంది బాలీవుడ్, హాలీవుడ్ నటులు ఇందులో నటిస్తున్నారు.

చాలా మందిని అనుకున్నారు.. ప్రకటించలేదు

చాలా మందిని అనుకున్నారు.. ప్రకటించలేదు

రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR తర్వాత తారక్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడన్న దానిపై ఎన్నో రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళ, కన్నడ, తెలుగు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో అట్లీ, ప్రశాంత్ నీల్, కొరటాల శివ సహా ఎంతో మందితో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ, ఏదీ ఫైనల్ అయినట్లు ప్రకటన మాత్రం రాలేదు.

హిట్ ఇచ్చిన దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు

హిట్ ఇచ్చిన దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు

RRR షూటింగ్ పూర్తయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తాడని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాకు ‘అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఫిక్స్ చేశారని అంటున్నారు. రాధాకృష్ణ నిర్మించనున్న ఈ మూవీలో రష్మిక మందన్నాను తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ సినిమా

నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ సినిమా

త్రివిక్రమ్‌తో పొలిటికల్ మూవీ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో ప్రాజెక్టు చేయబోతున్నాడని తాజాగా ఓ వార్త లీక్ అయింది. ‘అసురన్' సినిమాతో తెలుగు వాళ్లకు తెలిసిన ఈ డైరెక్టర్ గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు. ఈ క్రమంలోనే పలుమార్లు కొన్ని విభాగాల్లో జాతీయ అవార్డులను సైతం అందుకున్నాడు.

Recommended Video

Jr NTR Action Scene With Tiger In RRR Remembers A Hollywood Movie
 సినిమా చూసినప్పుడే డిసైడ్ అయిపోయాడట

సినిమా చూసినప్పుడే డిసైడ్ అయిపోయాడట

వాస్తవానికి వెట్రిమారన్ గతంలో ‘వాడా చెన్నై', ‘ఆడుకాలమ్', ‘విసారణై' వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించాడు. కానీ, ధనుష్ హీరోగా వచ్చిన ‘అసురన్'తో అతడు అందరికీ తెలిసిపోయాడు. ఈ మూవీ చూసినప్పుడే తారక్.. వెట్రిమారన్‌తో సినిమా చేయాలని భావించాడట. ఇందులో భాగంగానే ఈ ఇద్దరూ ఇటీవల కలిశారని, ఆ సమయంలో తారక్‌కు ఓ లైన్ వినిపించాడని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X