RRRతో పెరిగిన Jr ఎన్టీఆర్ డిమాండ్.. ఆ బడా బాలీవుడ్ సంస్థతో భారీ డీల్.. ఉహించని రెమ్యునరేషన్!
ఫైనల్ గా RRR సినిమా ఊహించినట్లే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దర్శకధీరుడు రాజమౌళి మరోసారి తన మేకింగ్ తో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక సినిమా కలెక్షన్లు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇక సినిమాలో నటించిన రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ లకు కూడా మొదటిసారి బాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా భారీ స్థాయిలో ఆఫర్స్ కూడా అందుకుంటున్నారు. ఇక పెరుగుతున్న డిమాండ్ తో ఇటీవల ఒక బాలీవుడ్ బడా సంస్థ జూనియర్ ఎన్టీఆర్ కు మంచి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

అప్పటి నుంచి పాన్ ఇండియా హవా..
ఒకప్పుడు మన స్టార్ హీరోలు కేవలం తెలుగులో తప్పితే మిగతా భాషల్లో ఎక్కువగా సినిమాలు చేసింది లేదు. తమిళ్ హీరోలు మన దగ్గర బాగానే డామినేట్ చేస్తున్నా మనవాళ్ళు మాత్రం అక్కడ ఎక్కువగా ఫోకస్ చేయలేదు. కానీ ఎప్పుడైతే దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి మరికొన్ని తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో క్లిక్ అవుతున్నాయి.

బాక్సాఫీస్ హిట్ గా RRR
రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మొట్ట మొదటి సినిమా RRR ఈ నెల 25న శుక్రవారం గ్రాండ్ గా విడుదలైంది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. ఇక రెండవరోజు కూడా నార్త్ లో అలాగే తమిళ్ లో కూడా కలెక్షన్స్ పెరిగాయి. ఫైనల్ గా సినిమా అయితే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

బాలీవుడ్ లో భారీ రెస్పాన్స్
ఇక గురువారం ప్రీమియర్స్ తోనే సినిమాకి బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు రాగా శుక్రవారం ఆ టాక్ తో కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. అయితే ఈ సినిమా అలా విడుదల అయ్యిందో లేదో హీరోలకు బాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయట. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు కంగ్రాట్స్ చెబుతున్న బడా ప్రొడక్షన్ సంస్థలు కాల్ చేసి డీల్ మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

ఆ సంస్థతో ఎన్టీఆర్ డీల్
ఇక రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కు ప్రముఖ బిగ్ ప్రొడక్షన్ సంస్థ టీ సీరీస్ కూడా ఒక ఆఫర్ చేసినట్లు సమాచారం. అసలైతే ముందు నుంచే ఈ సంస్థ RRR హీరోలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ వరుస కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడం వలన ఇప్పట్లో దొరకడం కష్టమని ఎన్టీఆర్ ను లాక్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
Recommended Video


భారీ రెమ్యునరేషన్
టీ సీరీస్ కు ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడితో కూడా చర్చలు జరువుతున్నట్లు సమాచారం. ఆ మధ్య సంజయ్ లీలా భన్సాలీ అని మరో పేరు కూడా వచ్చింది. కానీ ఇంకా ఫైనల్ అయితే కాలేదు. ఇక రెమ్యునరేషన్ అయితే RRR సినిమాకు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నట్లు సమాచారం. RRR కు దాదాపు 45కోట్ల వరకు తీసుకున్న తారక్ ఇప్పుడు 60కోట్ల వరకు డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











