RRR : తెలుగురాష్ట్రాల్లో అందరికంటే ముందు ఆ 52 మందికి సినిమా చూపిస్తున్న ఎన్టీఆర్.. ఎవరెవరిని పిలిచారంటే?
ప్రకటించిన అనేక సంవత్సరాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన రౌద్రం రణం రుధిరం RRR సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాని మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అయితే అమెరికా వాసులు మన కంటే ఒకరోజు ముందు ఉంటారు కాబట్టి వారు మనకంటే ఒక రోజు ముందే సినిమా చూస్తారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో మాత్రమే బెనిఫిట్ షోలకు అనుమతి లభించింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తన సన్నిహితుల కోసం ఒక స్పెషల్ షో అరేంజ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

ప్రతిష్టాత్మక చిత్రం
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం RRR. డివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డి.వి.వి.దానయ్య ఈ సినిమాను 450 కోట్ల రూపాయల బడ్జెట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించారు..

సమరయోధులు కలిస్తే
అసలు చరిత్రలో కలవని ఇద్దరు స్వతంత్ర సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుంది అని ఒక కల్పిత కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు రాజమౌళి గతంలోనే ప్రకటించారు. 2018 సంవత్సరంలో ప్రకటించిన ఈ సినిమా విడుదల కావడానికి 2022 వరకు పట్టింది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు..

అందరూ ఎదురుచూస్తున్నారు
అలాగే అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్రకని వంటి పాన్ ఇండియా స్టార్ సహా తెలుగులో టాలెంటెడ్ నటులైన రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ వంటి వాళ్లు కూడా కనిపిస్తున్నారు.. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అందరూ ఎదురుచూస్తున్నారు.

ఏఎంబి మాల్ లో మొదటి ఆట
గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా మా కేవలం భారతదేశంలోని ఐదు భాషలోనే కాక మరో ఐదు భాషల్లో కూడా విడుదల అవుతోంది. అయితే ఈ సినిమా విడుదల కావడానికి అంటే ఒక రోజు ముందే ఎన్టీఆర్ తనకు సన్నిహితులుగా భావించే 52 మందికి ఒక స్పెషల్ షో వేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు 24 వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కు చెందిన ఏఎంబి మాల్ లో మొదటి ఆట పడబోతోంది.
Recommended Video


ఏఎంబి మాల్ లో మొదటి ఆట
థియేటర్లో 52 రిక్లైనర్ సీట్లు గల ప్రివ్యూ థియేటర్ ఒకటి ఉంది. దానిని ఎన్టీఆర్ బుక్ చేయించారని సమాచారం. తన కుటుంబ సభ్యులతో సహా అతి సన్నిహితులు గా భావించే వారిని మాత్రమే ఎన్టీఆర్ ఆహ్వానించారని సమాచారం. ఆయన ఎవరెవరిని ఆహ్వానించారు అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఎవరిని ఆహ్వానించారు అనే దాని మీద చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక అమెరికాలో షోలు పడటం మొదలైన తర్వాత సోషల్ మీడియాలో రివ్యూలు బయటకు రావడం కామన్.. దానికంటే ముందు సినిమా వేయాలని భావించి ఎన్టీఆర్ ఈ సినిమా ప్రివ్యూ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











