Jr NTR: వార్ 2 కంటే ముందే బాలీవుడ్‌లోకి తారక్.. ఏకంగా సల్మాన్ ఖాన్‌తో కలిసి అలా!

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులను తన సినిమాలతో అలరిస్తోన్న అతడు.. RRR మూవీతో నేషనల్ క్రేజ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు.

అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు భారీ చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుతోన్నాడు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీలో ఎన్టీఆర్ నటించినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీరే చూడండి!

Jr NTR Plays Cameo Role in Salman Khan Starrer Tiger 3 Movie

టైగర్ 3 అంటూ వస్తున్నాడు: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రమే 'టైగర్ 3'. సూపర్ హిట్ మూవీలకు సీక్వెల్‌గా వస్తున్న దీన్ని మనీష్ శర్మ తెరకెక్కించాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌గా నటించారు. ఈ క్రేజీ యాక్షన్ మూవీకి ప్రీతమ్, తనూజ్ సంగీతాన్ని అందించారు.

Jr NTR Plays Cameo Role in Salman Khan Starrer Tiger 3 Movie

విడుదలకు రెడీ.. సందడిగా: సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'టైగర్ 3' మూవీని దీపావళి కానుకగా నవంబర్ 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. బడా హీరో నటించిన సినిమా కావడంతో పాటు హిట్ మూవీకి సీక్వెల్‌గా వస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇప్పుడు విడుదల సందర్భంగా ఈ సినిమా సందడి ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్‌లో కనిపిస్తోంది.

క్రేజీ న్యూస్.. ఫుల్ బుకింగ్స్: క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'టైగర్ 3' మూవీ నుంచి తరచూ ఏదో ఒక క్రేజీ న్యూస్ బయటకు వస్తూనే ఉంది. ముఖ్యంగా ఇందులో ఫలానా ఎపిసోడ్ అదిరిపోతుందని, ఫలానా యాక్షన్ సీన్స్ సూపర్‌గా ఉంటుందని ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి పెరిగి.. అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్‌గా అయిపోతున్నాయి.

టైగర్ 3 మూవీలో ఎన్టీఆర్: ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌పైన కూడా తెలుగు హీరోల ప్రభావం భారీగానే కనిపిస్తోంది. దీంతో మన స్టార్లు గురించి అక్కడ ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' మూవీలో టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఇప్పుడీ వార్త దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది.

Jr NTR Plays Cameo Role in Salman Khan Starrer Tiger 3 Movie

అలా పరిచయం చేస్తాడని: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. దీన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. వాళ్లు క్రియేట్ చేసిన యూనివర్శ్‌లో తారక్ భాగం కాబోతున్న నేపథ్యంలోనే అతడిని 'టైగర్ 3' మూవీ ద్వారా పరిచయం చేయబోతున్నారని అంటున్నారు. అంటే.. సల్మాన్ ఖాన్‌కు సహాయం చేసే ఓ రోల్‌లో ఎన్టీఆర్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.

పబ్లిసిటీ స్టంట్ అంటూనే: టాలీవుడ్ హీరోలకు దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో మన స్టార్లను బాలీవుడ్ వాళ్లు వాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే వచ్చిన ఓ భారీ సినిమాలోనూ మన హీరోలు నటించినట్లు పబ్లిసిటీ చేసుకున్నారు. ఇప్పుడు 'టైగర్ 3' మూవీలో ఎన్టీఆర్ నటించాడు అన్నది కూడా అలాంటి ప్రచారంలో భాగమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X