జేమ్స్ బాండ్ టైప్ పాత్రలో జూ.ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ త్వరలో జేమ్స్ బాండ్ తరహా క్యారెక్టరైజేషన్ లో కనిపించనున్నాడని సమాచారం. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఈ క్యారక్టరైజేషన్ ఉంటుందని చెప్తున్నారు. అయితే గెటప్ మాత్రం క్యాజువల్ గా ఉన్నా డైలాగులు,ఆ స్పీడు,సాహసాలు వంటివి జేమ్స్ బాండ్ పాత్రనుంచి ప్రేరణ పొంది డిజైన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. గణేష్ బాబు నిర్మించే ఈ చిత్రం షూటింగ్ మొత్తం అమెరికాలో జరగనుంది.
జూన్ లో ఈ చిత్రం లాంచింగ్ జరుగుతుంది. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్,కాస్టింగ్ కి అంచనాలు హడావిడిలో పూరి ఉన్నారు. ఇక మరో ప్రక్క ఎన్టీఆర్ తన తాజా చిత్రం దమ్ముతో దుమ్ము రేపటానికి రెడీ అవుతున్నారు. త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. కె.ఎ.వల్లభ నిర్మాత. ఉగాది సందర్భంగా ఈ నెల 23న పాటలు విడుదల చేస్తారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ సాగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ దమ్ము గురించి చెప్పే ఓ శ్లోకాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. పూరీ జగన్నాధ్ మాత్రం వరసగా రవితేజతో దేముడు చేసిన మనుషులు, పవన్ కళ్యాణ్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలు ప్రకటించి ఉన్నారు.


Click it and Unblock the Notifications











