తారక్ కోసం సరికొత్త కథను సిద్ధం చేసిన ప్రశాంత్.. దుమ్ము దులపడం ఖాయమంటూ..
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం 'RRR'. వరుస విజయాలతో దూసుకుపోతున్న అతడు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కొమరం భీంగా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తారక్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో కన్నడలో వచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం అయిన 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా కూడా ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
దీనికి మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాత నవీన్ యెర్నేని మరింత బలం చేకూర్చేలా ఇటీవల మాట్లాడాడు. ''మేము ప్రశాంత్, తారక్‌తో చర్చలు జరుపుతున్న విషయం నిజమే. ప్రశాంత్ వచ్చి తారక్‌కు స్టోరీ చెప్పి, అది ఆయనకు నచ్చితే కచ్చితంగా ముందుకు వెళ్తాం. అన్నీ ఓకే అయితే బహుశా 2020 చివర్లో మా సినిమా ప్రారంభం అవుతుంది. అప్పటికి ఎన్టీఆర్ 'RRR', ప్రశాంత్ 'కేజీఎఫ్.. చాప్టర్ 2' పూర్తవుతాయి'' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. నవీన్ చేసిన వ్యాఖ్యలతో వీళ్లిద్దరి మూవీ దాదాపుగా కన్ఫార్మ్ అని ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి సమయంలో ఈ సినిమా గురించి మరో వార్త బయటకు వచ్చింది. తారక్‌తో సినిమా తీసే విషయంలో ప్రశాంత్ నీల్ పక్కాగా ఉండాలని భావిస్తున్నాడట. ఇందులో భాగంగానే యంగ్ టైగర్‌తో చేసే సినిమాను కొంత ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటున్నాడని తెలిసింది. అందుకోసమే.. ఈ సినిమాలో తారక్‌ను డ్యాన్సర్‌గా చూపించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్టును కూడా మైత్రీ మూవీస్ సంస్థకు వినిపించేశాడట సదరు దర్శకుడు. ఇది తారక్ విని ఓకే అన్న వెంటనే షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, డ్యాన్సర్‌గా తారక్ నటిస్తాడనగానే ఆయన అభిమానులు మాత్రం తెగ ఖుషీ అయిపోతున్నారు. దీనికి కారణం ఈ యంగ్ హీరో డ్యాన్స్‌లో టాపర్‌గా ఉండడమే. జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడంతో టాలీవుడ్‌లో అతడు టాప్ డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.


Click it and Unblock the Notifications











