మళ్ళీ జూ ఎన్టీఆర్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్
జూ.ఎన్టీఆర్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో అప్పట్లో ఆంధ్రావాలా చిత్రం వచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అప్పటినుంచీ వారిద్దరూ కలిసి మరో చిత్రం చేయలేదు. పూరీ మాత్రం ఇంటర్వూల్లో పొరపాటు జరిగిందని ఈసారి ఎన్టీఆర్ తో హిట్టు ఇస్తానని చెప్తూ వస్తున్నారు.. కానీ ఆ సమయం రాలేదు. అయితే ఇప్పుడు నల్లమలుపు బుజ్జి నిర్మాతగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ మేరకు సిట్టింగ్స్ జరిగాయని ఎన్టీఆర్ కూడా సముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పూరి వరస ఫ్లాఫులతో (బుజ్జిగాడు మేడిన్ చెన్నై , నేనింతే, ఏక్ నిరంజన్..)ముందుకు వెళ్తూ ప్రసుత్తం గోపీచంద్ తో గోలీమార్ చిత్రం రూపొందిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ నటించిన అదుర్స్ చిత్రం మొన్న సంక్రాంతికి రిలీజ్ అయింది. ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బృందావనం, మొహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి చిత్రాలు చేస్తున్నారు. ఇక నల్లమలుపు బుజ్జి మొదట హరీష్ శంకర్ , ఎన్టీఆర్ కాంబినేషన్లో ఆ మధ్య ఎమ్మేల్యే చిత్రం రూపొందించాలని ప్లాన్ చేసారు. అయితే అది వర్కవుట్ కాలేదు. హరీష్ శంకర్ బయిటకు వెళ్ళి రవితేజాతో మిరపకాయ చిత్రాన్ని చేస్తున్నారు. దాంతో పూరీ కాంబినేషన్ ముందుకొచ్చింది. మరి ఈ సారన్నా ఆంధ్రావాలా లాంటి సినిమా కాకుండా పోకిరి లాంటి హిట్ ఎన్టీఆర్ కి ఇవ్వాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











