అన్నీ అనుమానాలే... మరి నిజాలేమిటి..?: రాజమౌళి ఇంకా మౌనం వీడటం లేదు

సెన్సేషనల్ న్యూస్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. చాలా చాలా పెద్దవారే ఈ న్యూస్‌కి సంబంధించిన డిటెయిల్స్‌ని కన్ఫాం చేస్తున్నారు. స్టూడెంట్ నంః1తో పాటు ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సింహాద్రిని కూడా డైరెక్ట్ చేసిన రాజమౌళి కాంబినేషన్‌లో ఎన్టీఆర్ సినిమా. ఇదే చాలా పెద్ద న్యూస్ అనుకుంటే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోయేది ఓ టిడిపి ఎంపి అట. ఆ ఎంపీ ఎవరంటే మహేష్‌బాబు బావ గల్లా జయదేవ్ అట.

సడన్‌గా మీడియా సర్కిల్స్‌లో ఈ న్యూస్ డిస్కషన్‌కి వచ్చింది. విజయేంద్రప్రసాద్ తయారు చేసిన ఓ మాంచి మాస్ మసాలా ఎంటర్టైనర్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అన్నీ అటాలే. పైగా బోలెడన్ని సందేహాలు. రాజమౌళితో గల్లా జయదేవ్ భారీ బడ్జెట్ సినిమా తీయాలి అనుకుంటే అందులో మహేష్ హీరో అయ్యే ఛాన్సుంది కానీ ఎన్టీఆర్‌తో ఎందుకు చేస్తాడు? అనేది ఫస్ట్ డౌట్.

rt-rajamouli

బాహుబలి-2 సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి ఓ భారీ చారిత్రక, పౌరాణాక చిత్రం తీయబోతున్నారని సమాచారం. "గరుడ" పేరుతో తెరకెక్కించే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్ర పోషించనున్నారనే వార్త కూడా ఆ మధ్య వినిపించింది. మరి ఇప్పుడు చెబుతున్నది ఆ సినిమా గురించేనా అన్నది కూడా ఒక అనుమానం.

బ్యాక్‌గ్రౌండ్‌లో చంద్రబాబు ఉండి ఎన్టీఆర్‌తో రిలేషన్స్‌ని మళ్ళీ డెవలప్ చేసుకోవడం కోసం, నెక్ట్స్ ఎలక్షన్స్‌లో ఎన్టీఆర్‌ని టిడిపి తరపున ప్రచారం చేయించడం కోసం ఈ స్కెచ్ వేశాడని కూడా అంటున్నారు. ఏంటో మొత్తం స్టోరీలో ఒక్కటి కూడా నమ్మశక్యంగా అనిపించడం లేదు మరి. ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.....

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X