ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కల్యాణ్.. ఓ మల్టీస్టారర్.. బడా డైరెక్టర్ మాస్టర్ ప్లాన్.!

By Manoj

మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో మల్టీస్టారర్ మూవీలు చాలా తక్కువగా వస్తుంటాయి. మొదటి తరం హీరోలు ఆ తరహా సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనకాడలేదు. అయితే, తర్వతి జనరేషన్ వాళ్లు మాత్రం వాటిని అంతగా పట్టించుకోలేదు.. అలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. అయితే, నేటి తరం వాళ్లు మాత్రం మల్టీస్టారర్ మూవీలు చేయడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగానే కొన్నేళ్లుగా ఆ సినిమాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతుందట. ఆ వివరాలు మీకోసం.!

 వాటి వల్లే మల్టీస్టారర్ మూవీలు వస్తున్నాయి

వాటి వల్లే మల్టీస్టారర్ మూవీలు వస్తున్నాయి

కొన్నేళ్లుగా తెలుగులో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. దీనికి కారణం అటువంటి సినిమాలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనే. మహేశ్ బాబు, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', వెంకీ.. పవన్ కల్యాణ్ కలిసి చేసిన ‘గోపాల.. గోపాల', ‘మనం', ‘F2', ‘వెంకీ మామ' సహా మరికొన్ని చిత్రాలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

 టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్ ఇదే

టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్ ఇదే

తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోన్న చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో టాప్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత. ఇందులో పలు ఇండస్ట్రీలకు చెందిన నటులు కీలక పాత్రలు చేస్తున్నారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ మరోసారి కలుస్తున్నారు

ఎన్టీఆర్, రామ్ చరణ్ మరోసారి కలుస్తున్నారు

ప్రస్తుతం RRR మూవీలో కలిసి నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్... మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని కొద్ది రోజుల క్రితం ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హల్‌చల్ చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారనే టాక్ వినిపించింది. అన్నీ సెట్ అయితే ఈ సినిమా 2022లో ప్రారంభం అవుతుందని జోరుగా ప్రచారం జరిగింది.

తారక్ లైన్‌లో పెట్టాడు.. చెర్రీ ప్రకటించలేదు

తారక్ లైన్‌లో పెట్టాడు.. చెర్రీ ప్రకటించలేదు

RRR మూవీ తర్వాత ఎన్టీఆర్... త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ‘అయిననూ పోయి రావలె హస్తినకు' అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్నాడు. ఇక, రామ్ చరణ్ మాత్రం ఇప్పటి వరకు తన తదుపరి సినిమాను ప్రకటించలేదు. అయితే, తన తండ్రి చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య'లో కీలక పాత్ర పోషిస్తున్నాడని చెబుతున్నారు.

ఎన్టీఆర్, చరణ్, పవన్ కల్యాణ్.. ఓ మల్టీస్టారర్

ఎన్టీఆర్, చరణ్, పవన్ కల్యాణ్.. ఓ మల్టీస్టారర్

త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్... జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించబోతున్న సినిమాకు సంబంధించి తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది. దీని ప్రకారం... ఈ భారీ మల్టీస్టారర్ మూవీకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడట. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్‌తో పాటు హారిక హాసినీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తాయని ఓ న్యూస్ బయటకొచ్చింది.

 చరణ్ సినిమా కాదు... ఈ మల్టీస్టారర్ గురించే

చరణ్ సినిమా కాదు... ఈ మల్టీస్టారర్ గురించే


వాస్తవానికి రెండు రోజుల క్రితం రామ్ చరణ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని ఓ న్యూస్ ప్రచారం అయింది. అంటే... చెర్రీ హీరోగా నటించే ఈ సినిమాను పవన్ నిర్మిస్తున్నాడని అన్నారు. ఈ కాంబినేషన్‌ను త్రివిక్రమే సెట్ చేశాడన్నది ఆ వార్తల సారాంశం. కానీ, అసలు విషయం మాత్రం మల్టీస్టారర్‌కు పవన్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట.

Recommended Video

Bollywood Nepotism : RRR లో ఆలియా భట్ వద్దు అంటున్న Sushant Singh Rajput ఫ్యాన్స్
 ముగ్గురు స్టార్ హీరోలు కలిస్తే రచ్చ రచ్చే

ముగ్గురు స్టార్ హీరోలు కలిస్తే రచ్చ రచ్చే


నిన్న మొన్నటి వరకు మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య సత్సంబంధాలు అంతగా ఉండేవి కాదు. కానీ, RRR మూవీ ప్రకటన వెలువడినప్పటి నుంచి వారంతా కలిసి మెలిసి ఉంటున్నారు. ఇక, పవన్ కల్యాణ్ కూడా కలిస్తే వాళ్ల ఆనందానికి అవధులు ఉండవు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు కనుక కార్యరూపం దాల్చితే టాలీవుడ్ హిస్టరీలోనే ప్రతిష్టాత్మక చిత్రం అవుతుందనడంలో సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X