Jr NTR Ram Charan: ఆస్కార్ తర్వాత ఒకే వేదికపై ఎన్టీఆర్-రామ్ చరణ్.. అఖిల్ కోసం భారీ స్కెచ్!
తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన చిత్రం RRR. అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భారీ మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ సినిమాపై యావత్ ప్రపంచమే ప్రశంసల వర్షం కురిపించింది. తాజాగా అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ గెలిచిన ఈ సినిమా అంతకుముందే అనేక పురస్కారాలు సాధించి ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమా కోసం ప్రమోషన్స్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకే వేదికపై కలిసి సందడి చేశారు. ఎమ్ఎమ్ కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నప్పుడు హగ్ చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి వీరిద్దరు ఒకే వేదికపై సందడి చేయనున్నారు.

మనంలో కేమియో..
అక్కినేని నాగార్జున, శరత్ కుమార్, ఆమని నటించిన సూపర్ హిట్ చిత్రం సిసీంద్రిలో బాబుగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు అఖిల్. అనంతరం మనం సినిమాలో చిన్న కెమియో చేసి అదరగొట్టాడు. అయితే ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అంతగా గుర్తింపు పొందలేకపోయాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు వరుసగా ఫ్లాప్ ల మీద ఫ్లాప్ లు ఇచ్చాయి. కానీ 2021లో చివరిసారిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో మొదటిసారిగా హిట్ ట్రాక్‌లో పడ్డాడు.

సాలిడ్ హిట్ కొట్టాలని..
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలో అఖిల్ సరసన హీరోయిన్గా బుట్టబొమ్మ పూజా హెగ్డే ఆకట్టుకుంది. అలాగే అతిథి పాత్రల్లో పలువురు హీరోయిన్స్ సైతం అలరించిన విషయం తెలిసిందే. అయితే ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ సినిమా సక్సెస్ అయిన అఖిల్ కు మాత్రం అంతగా క్రేజ్ తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో తర్వాతి సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు అఖిల్. ఈ క్రమంలోనే ఎలాగైన విజయం సాధించాలని ఏజెంట్ గా రాబోతున్నాడు.

యాక్షన్ సీక్వెన్స్ తో..
ఏజెంట్ సినిమా కోసం అఖిల్ అక్కినేని తన బాడీని తెగ కష్టపెట్టాడు. ఫలితంగా ఇందులో సిక్స్ ప్యాక్ బాడీతో అలరించనున్నాడు అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న అఖిల్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటించడం విశేషం. ఇదివరకు విడుదల చేసిన టీజర్ లో యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టాడు అఖిల్. ముఖ్యంగా మమ్ముట్టి చెప్పిన డైలాగ్ లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

పాన్ ఇండియాగా..
అఖిల్ ఏజెంట్ సినిమాలో హీరోయన్ గా సాక్షి వైద్య సందడి చేసేందుకు రెడీగా ఉంది. ఏజెంట్ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై నిర్మించగా.. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిపాప్ తమీజా సంగీతం అందించారు.

భారీగా ప్రమోషన్స్..
ఇప్పటికే అఖిల్ ఏజెంట్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే భారీగానే ప్రమోషన్స్ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఇద్దరు గ్లోబల్ స్టార్స్ ను రంగంలోకి దించనున్నట్లు సమాచారం. RRR మూవీ ద్వారా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు వచ్చింది. ఆ సినిమా కోసం ఇద్దరు కలిసి ఒకే వేదికపై సందడి చేశారు.

చెర్రీ, తారక్ ఒప్పుకున్నారని..
ఆస్కార్ అవార్డ్ వచ్చిన తర్వాత చెర్రీ, తారక్ ఇద్దరు కలిసి మళ్లీ కనిపించలేదు. ఇప్పుడు వారిద్దరు అఖిల్ కోసం ఒకే స్టేజీపై సందడి చేయనున్నారట. అక్కినేని అఖిల్ కు ఇటు మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్, అటు నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉంది. అందుకే వారిద్దరిని ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా ఆహ్వానించారని, అందుకు వారు సుముఖంగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ, ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, స్థలంపై ప్రకటన రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











