»   » రాజమౌళి ప్లానింగ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.. ఎన్టీఆర్, రాంచరణ్‌తో..

రాజమౌళి ప్లానింగ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.. ఎన్టీఆర్, రాంచరణ్‌తో..

Posted By:
Subscribe to Filmibeat Telugu
బాహుబలి గ్రాఫిక్స్ మళ్ళీ రిపీట్

బాహుబలి చిత్రం తర్వాత దర్శకుడు రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందించేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్కిప్టు వర్క్ పూర్తయినట్టు సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో బాహుబలి మాదిరిగా కంప్యూటర్ గ్రాఫిక్స్ చోటు ఉందని రాజమౌళి వర్గాలు వెల్లడిస్తున్నాయి. రోజు రోజుకు ఈ సినిమాపై భారీ అంచనాల పెరుతుండటమే కాదు.. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

 ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రలు..

ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రలు..

జక్కన్న రూపొందించే చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రలు విభిన్నంగానూ, విలక్షణంగాను ఉంటాయనేది తాజా సమాచారం. ఇటీవల అమెరికాలో 10 రోజులపాటు టెస్ట్ షూట్ కూడా నిర్వహించారు. ఈ పాత్రల రూపకల్పన కోసం ఈ టెస్ట్ షూట్ చేసినట్టు తెలుస్తున్నది.

బ్రదర్స్‌గా మెగా, నందమూరి హీరోలు

బ్రదర్స్‌గా మెగా, నందమూరి హీరోలు

సినీ వర్గాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ సోదరులుగా కనిపిస్తారట. అంతేకాకుండా ఇద్దరు బాక్సర్లుగా కనిపించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానున్నది. రాంచరణ్, ఎన్టీఆర్ సోదరులుగా నటిస్తున్నారు అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా ట్వీట్ చేశారు.

 ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌ బాడీతో

ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌ బాడీతో

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారి సిక్స్‌ప్యాక్‌లో కనిపించనున్నాడట. అందుకోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ నిపుణుల సహకారంతో దేహధారుడ్యాన్ని పెంచుకొంటున్నట్టు తెలిసింది. జిమ్‌లో ఎన్టీఆర్ చేస్తున్న కసరత్తు ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం తెలిసిందే.

 తొలిసారి రేర్ కాంబినేషన్

తొలిసారి రేర్ కాంబినేషన్

టాలీవుడ్ చరిత్రలో రాజమౌళి రూపొందించే మల్టీస్టారర్‌కు ఓ ప్రత్యేకత ఉంది. తొలిసారి మెగా, నందమూరి హీరోలు ఇద్దరు కలిసి నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. అంచనాలకు తగినట్టే రాజమౌళి పాత్రల పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నట్టు తెలుస్తున్నది.

 విజయేంద్ర ప్రసాద్ కసరత్తు

విజయేంద్ర ప్రసాద్ కసరత్తు

కథ, కథనాలకు సంబంధించిన పని పూర్తయినప్పటికీ.. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తుది మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

 వచ్చే వేసవి బరిలో

వచ్చే వేసవి బరిలో

అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభించి ఫిబ్రవరి, మార్చి 2019 లోపు సినిమాను కంప్లీట్ చేయాలనే ప్లాన్‌తో రాజమౌళి ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది. వచ్చే ఏడాది వేసవి బరిలో రాజమౌళి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

English summary
After Baahubali 2: The Conclusion‘s super success, the expectations from SS Rajamouli film are sky high. The final scripting is still being done by Rajamouli’s father – K. V. Vijayendra Prasad and the shoot will begin from October 2018. In the film, Jr NTR will also be seen showcasing his six pack abs. With so much buzz surrounding the film, the movie will be shot under strict security. SS Rajamouli’s mega project with Jr NTR and Ram Charan is set to go on floors in October.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu