RRR నుంచి సెన్సేషనల్ న్యూస్ లీక్: మూవీలో ఎన్టీఆర్, చరణ్ కలిసేది అప్పుడే.. ఏకంగా 400 మందితో!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ప్రకటన సమయం నుంచే భారీ అంచనాలను ఏర్పరచుకుంటాయి. అలాంటి వాటిలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీపై అన్ని ఇండస్ట్రీలు దృష్టి సారించాయి. అంతలా ఈ మూవీ రిలీజ్‌కు ముందే ప్రభావాన్ని చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాలోని మెయిన్ సీన్ బయటకు వచ్చింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

విప్లవ వీరులుగా మారిన టాలీవుడ్ స్టార్లు

విప్లవ వీరులుగా మారిన టాలీవుడ్ స్టార్లు

తెలుగు రాష్ట్రాల్లో ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రల ఆధారంగా రూపొందుతోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, హీరోయిన్లు. ఇందులో రామ్ చరణ్.. అల్లూరిగా, జూనియర్ ఎన్టీఆర్.. భీంగానూ నటిస్తున్నారు.

మరోసారి ఆటంకం.. ఆగిపోయిన క్లైమాక్స్

మరోసారి ఆటంకం.. ఆగిపోయిన క్లైమాక్స్

RRR మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండున్నరేళ్లు అవుతోంది. కానీ, ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తీ కాలేదు. దీనికి పలుమార్లు ఆటంకం ఏర్పడడమే కారణం. ఇక, ఇటీవలే క్లైమాక్స్ సీన్‌ చిత్రీకరణను ప్రారంభించారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ కూడా వేశారు. ఇంతలో కరోనా ప్రభావం పెరగడంతో షూటింగ్‌ను మళ్లీ వాయిదా వేశారు.

ఇద్దరూ అలా వచ్చారు.. రికార్డులు కొట్టారు

ఇద్దరూ అలా వచ్చారు.. రికార్డులు కొట్టారు

ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ మూవీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిందే. అందుకే దీని నుంచి ఏది వచ్చినా రికార్డు బద్దలు కొడుతోంది. ఈ మూవీ నుంచి మొదటిగా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీం' విడుదలయ్యాయి. ఈ రెండూ రికార్డులు బ్రేక్ చేసేశాయి.

అప్పుడే అంచనాలు.. ఇండియన్ రికార్డు

అప్పుడే అంచనాలు.. ఇండియన్ రికార్డు

కొంత కాలంగా ఇండియన్ సినిమాలో ఉన్న ఇండస్ట్రీల దృష్టి మొత్తం RRR మూవీపైనే ఉంది. అందుకే ఈ సినిమాను విడుదల చేయాలని ఎంతో మంది బయ్యర్లు క్యూ కడుతున్నారు. ఈ కారణంగానే దీనికి రికార్డు స్థాయిలో డీల్స్ వస్తున్నాయి. అందుకగుణంగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఫలితంగా దాదాపు రూ. 500 కోట్లకు ఈ చిత్రం అమ్ముడు పోవడం విశేషం.

మరోసారి వాయిదా... ఈ సారి అప్పటికి

మరోసారి వాయిదా... ఈ సారి అప్పటికి

RRRను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఆరంభంలో ప్రకటించింది. కానీ, అనుకున్న తేదీకి చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో జనవరి 8, 2021కి వాయిదా వేశారు. అయితే, ఇప్పుడు కూడా అదే పరిస్థితి వల్ల అక్టోబర్ 13, 2021న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో మళ్లీ కరోనా ప్రభావం పెరగడంతో దీన్ని 2022 సమ్మర్‌కు పోస్ట్‌పోన్ చేసినట్లు తెలుస్తోంది.

మూవీలో ఎన్టీఆర్, చరణ్ కలిసేది అప్పుడే

మూవీలో ఎన్టీఆర్, చరణ్ కలిసేది అప్పుడే

ఈ ప్రతిష్టాత్మక చిత్రం విషయంలో రాజమౌళి అండ్ టీమ్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఏదో ఒక విషయం లీక్ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా హీరోల కాంబో సీన్ గురించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ ఓ ఫైట్ సీన్ సమయంలో ఎదురుపడడం ద్వారా కలుస్తారట.

Recommended Video

Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
ఏకంగా నాలుగు వందల మందితో ఫైటింగ్

ఏకంగా నాలుగు వందల మందితో ఫైటింగ్

అడవిలో పోరాటం చేస్తున్న ఎన్టీఆర్ కోసం.. రామ్ చరణ్ ఏకంగా వంద మంది పోలీసులను వెంట బెట్టుకుని వస్తాడట. అప్పుడు వాళ్లను ప్రతిఘటించేందుకు ఏకంగా 300 వందల మంది గిరిజనులతో కలిసి ఎన్టీఆర్ పోరాటానికి సిద్ధం అవుతాడట. ఈ సీన్ దాదాపు 20 నిమిషాలు ఉంటుందట. ఈ సమయంలోనే ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవడంతో ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X