జూ ఎన్టీఆర్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కన్ఫర్మ్...డిటేల్స్
ప్రముఖ నిర్మాత రామానాయుడు బ్యానర్ లో ఎన్టీఆర్ తో రూపొందించిన రాముడు-భీముడు చిత్రం అప్పట్లో సూపర్ హిట్. ఇప్పుడా చిత్రం రీమేక్ చేయాలని రామానాయుడు ప్లాన్ చేస్తున్నారు. దానికి జూ ఎన్టీఆర్ అయితే సరిపోతారని బావించి అతన్ని సంప్రదించటం జరిగింది. అయితే చేస్తాను అని గాని చేయనని గానీ ఎన్టీఆర్ క్లియర్ గా చెప్పకుండా చూద్దామని దాటేస్తూ వస్తున్నారు. అయితే రీసెంట్ గా రామానాడుయు రాముడు-భీముడు 2012 అనే టైటిల్ ని ఫిల్మ్ చాంబర్ లో రిజస్టర్ చేసారు. దాంతో ఈ చిత్రం పట్టాలు ఎక్కే అవకాశముందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని మొదట అనుకున్నట్లుగా రాజమౌళి కాకుండా రాఘవేంద్రరావు డైరక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరైన రాఘవేంద్రరావుఈ చిత్రాన్ని బాగా డీల్ చేస్తారని భావిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా ఇప్పటివరకూ ఆయన దర్సకత్వ పర్యవేక్షణలో చేయటమే కాని డైరక్ట్ గా చేయలేదు. దాంతో ఈ ప్రాజెక్టుకి మంచి క్రేజ్ వచ్చే అవకాశం కనపడుతోంది.


Click it and Unblock the Notifications











