twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పౌరానిక చిత్రాలకు ప్రాణం పోయనున్న జూ ఎన్టీఆర్, రాణా...

    By Sindhu
    |

    సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రిజిష్టర్ అయిన రెండు కొత్త టైటిల్స్ పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 'పాతాళ భైరవి", 'రాముడు భీముడు" టైటిల్స్ ని సురేష్ బ్యానర్ పై ఇటీవలే రిజిష్టర్ చేశారు. అలనాటి మేటి చిత్రాలైన పాతాళ భైరవి, రాముడు భీముడు టైటిల్స్ చూడగానే సురేష్ సంస్థ భారీ ప్లాన్స్ లో ఉందన్న సంగతి స్పష్టమవుతోంది. అయితే ఈ రెండు చిత్రాల్లో స్టార్ కాస్ట్ ఎవరనే దానిపై ఇంకా ఎలాంటి ఇన్ ఫర్మేషన్ అందలేదు.

    'రాముడు భీముడు" టైటిల్ తో జూ ఎన్టీఆర్ హీరోగా సినిమా నిర్మించాలని ఉందని రామానాయుడు పలుమార్లు చెప్పారు. సురేష్ బ్యానర్ లో 'నరసింహుడు" తర్వాత ఎన్టీఆర్ సినిమా మొదలు కావాల్సి ఉండగా, కొన్ని కారణాల రిత్యా అది ఆగిపోయింది. అయితే సురేష్ బాబు దగ్గర ఎన్టీఆర్ డేట్స్ మాత్రం అలానే ఉన్నాయి. ఒకవేళ 'రాముడు భీముడు" చిత్రం జూ ఎన్టీఆర్ తో తీస్తారని అనుకున్నా 'పాతాళ బైరవి" ఎవరితో ఉంటుందని అనుకోవచ్చంటారు?'పాతాళ భైరవి" తరహా చిత్రం చేయాలని ఉందని ఆమధ్య దగ్గుబాటి రాణా చెప్పాడు. భారీ బడ్జెట్ అవసరమయ్యే ఆ చిత్రాన్ని కొడుక్కి కానుకగా సురేష్ బాబు నిర్మిస్తారేమో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X