టాక్ ఆఫ్ ది టౌన్: పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ యూటర్న్.. కాంట్రవర్శీ అవుతుందనే ఈ నిర్ణయం.!

By Lekhaka

తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా చెబుతుంటారు. దీనికి కారణం.. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించుకోవడమే. అందుకే తక్కువ వయసులోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు తారక్. కెరీర్ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సమయంలో పొలిటికల్ ఎంట్రీ గురించి ఎన్టీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నాడట. దీంతో తారక్ గురించి ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది. ఇంతకీ ఏం జరిగింది.? ఆ వివరాలు మీకోసం.!

 సూపర్ ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్

సూపర్ ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్

ఒకానొక సమయంలో వరుస పరాజయాలతో కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. సరిగ్గా అప్పుడే పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్' మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి అతడు వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి వరుస విజయాలను దక్కించుకుని దూసుకుపోతున్నాడు.

జక్కన్నతో మళ్లీ కలిశాడు.. ఈ సారి గ్రాండ్‌గా

జక్కన్నతో మళ్లీ కలిశాడు.. ఈ సారి గ్రాండ్‌గా

జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వీళ్ల కాంబోలో ‘స్టూడెంట్ నెం1', ‘సింహాద్రి' ‘యమదొంగ' వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ జంట మరోసారి RRR అనే మూవీ కోసం కలిసింది. ఇందులో తారక్‌తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమా విడుదల కానుంది.

తారక్ టార్గెట్ అదే.. అందుకే కఠిన నిర్ణయాలు

తారక్ టార్గెట్ అదే.. అందుకే కఠిన నిర్ణయాలు

ప్రస్తుతం తారక్ దృష్టంతా రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR మీదే ఉంది. అందుకే ఈ సినిమా కోసం అతడు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడట. ఇప్పటికే ఈ మూవీ కోసం జిమ్‌లో గంటల తరబడి శ్రమిస్తున్న ఎన్టీఆర్.. ఓ సీన్ కోసం పులి ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ మూవీ కోసమే గుండుతో కనిపించబోతున్నాడని అంటున్నారు.

ఎన్టీఆర్ తర్వాతి సినిమాపై క్లారిటీ వచ్చేసింది.!

ఎన్టీఆర్ తర్వాతి సినిమాపై క్లారిటీ వచ్చేసింది.!

RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే సినిమా గురించి ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకుల పేర్లు సైతం తెరపైకి వచ్చాయి. అయితే, తాజాగా తారక్ నెక్ట్స్ మూవీ ప్రకటన వెలువడింది. ఈ మూవీని త్రివిక్రమ్ తెరకెక్కించనున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ దీనిని నిర్మిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

అంచనాలను అందుకునేందుకు అలా ఫిక్స్ అయ్యారు

అంచనాలను అందుకునేందుకు అలా ఫిక్స్ అయ్యారు

‘అరవింద సమేత' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉంటాయి. వాటిని అందుకునేందుకే ఈ మూవీని పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కిచబోతున్నారని, దీని కోసం ‘అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ యూటర్న్

పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ యూటర్న్

పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో సాగే ఈ సినిమాలో తారక్ నాయకుడిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయింది. అందరూ అనుకుంటున్నట్లు ఇది పొలిటికల్ బేస్‌డ్ మూవీ కాదట. దీన్ని కూడా త్రివిక్రమ్ తన గత చిత్రాల మాదిరిగా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబోతున్నాడని ఇండస్ట్రీలో ఓ వార్త తాజాగా చక్కర్లు కొడుతోంది.

Recommended Video

Jr NTR Achieves Rare Feat || Filmibeat Telugu
కాంట్రవర్శీ అవుతుందనే ఈ నిర్ణయం.!

కాంట్రవర్శీ అవుతుందనే ఈ నిర్ణయం.!

కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న దానిపై ఎన్టీఆర్ యూటర్న్ తీసుకోవడంపైనా ఓ న్యూస్ బయటకు వచ్చింది. వాస్తవానికి త్రివిక్రమ్.. తారక్‌కు పొలిటికల్ స్టోరీనే చెప్పాడట. దీన్ని ముందుగా ఓకే చేసిన అతడు.. కాంట్రవర్శీ అయ్యే ఛాన్స్ ఉందన్న కారణంతో ఈ కథను రిజెక్ట్ చేశాడట. దీంతో త్రివిక్రమ్ మరో ఫ్యామిలీ స్టోరీ చెప్పడం.. అది తారక్‌కు నచ్చడం జరిగాయని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X