వదిలించుకోవాలని డిసైడైన జూ ఎన్టీఆర్
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందంగా...తాతలు, తండ్రుల పేరు చెప్పుకుని మన తెలుగు సినీ పరిశ్రమలో పైకెదిగన వారు చాలా మందే ఉన్నారు. నందమూరి కుటుంబం, అక్కనేని, చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన హీరోలంతా దాదాపు అదే బాపతు. అయితే ఇందులో మంచి టాలెంట్ కలిగిన హీరోలు కూడా ఉన్నారూ..అది వేరే విషయం.
తాజాగా విషయానికొస్తే జూనియర్ ఎన్టీఆర్ తనకున్న నందమూరి బ్రాండ్ ఇమేజ్ ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడట. ఆ ఇమేజ్ కారణంగా ఎన్టీఆర్ ఇప్పడు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాడట్లు తెలుస్తూంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కమ్మ, కాపు లాంటి కులాల లాంటి తారతమ్యాలు బాగా ఉన్నాయి. వీటిలో ఒక వర్గానికి చెందినదే నందమూరి వంశం. దీని కారణంగా ఒక వర్గానికి చెందిన ప్రక్షకులు తనను ఆదరించడం లేదనే బాధ జూనియర్ ను వెంటాడుతోంది.
దీనికి తోడు..ఇటీవల కాలంలో తాతలు, తండ్రుల గురించి గొప్పలు చెప్పుకుంటూ డైలాగులు రాయించుకుంటున్న యువ హీరోలను..ప్రేక్షకులు హేలన చేస్తున్నారు. వంశాన్ని పొగుడు కోవడం తప్ప వీళ్లకి ఏదీ చేతకాదనే విమర్శకూడా ఉంది. ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ నందూమరి బ్రాండ్ ఇమేజ్ ను తొలగించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఫిల్మనగర్ టాక్. అదే జరిగితే ఇకపై జూ.ఎన్టీఆర్ సినిమాల్లో వంశాన్ని, కుటుంబాన్ని పొగిడే డైలాగులు ఉండవేమె...?


Click it and Unblock the Notifications











