Jr NTR : ఎన్టీఆర్ లైపో చేయించుకున్నాడా?.. వైరల్ అవుతోన్న వీడియో
గ్లామర్ ఫీల్డ్ అయిన చిత్ర పరిశ్రమలో నటీనటులపై రూమర్స్ సహజం. కొందరు వీటిని పట్టించుకుంటే , ఇంకొందరు మాత్రం చూసీచూడనట్లుగా వదిలేస్తారు. కొన్ని పుకార్లకు అప్పుడే ఫుల్‌స్టాప్ పడితే.. ఏళ్లు దాటినా ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇలాంటి వాటిలో ఒకటి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వెయిట్ లాస్. భారీ బరువుతో ఉండే ఎన్టీఆర్ ఉన్నపళంగా తన వెయిట్‌ని ఎలా కంట్రోల్ చేసుకున్నాడనేది ఇప్పటికీ అభిమానులకు షాక్‌గా ఉంటుంది. తాజాగా దీనిపై ఎన్టీఆర్ స్వయంగా మాట్లాడిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
అన్న నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మూడో తరం నటుడిగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో ఒకరిగా దుమ్మురేపుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ తరంలో నవరసాలను అద్భుతంగా పలికించగల.. సింగిల్ టేక్‌లో ఎంతటి క్లిష్టమైన షాట్‌నైనా ఓకే చేయగల అరుదైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు తారక్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర పార్ట్ 1 బ్లాక్‌బస్టర్ కావడంతో ఎన్టీఆర్ ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు ఎన్టీఆర్.

20-5-1983న నందమూరి హరికృష్ణ - శాలిని దంపతులకు జన్మించారు తారక్. రూపమే కాదు నటన, ఆహార్యం, వాక్చాతుర్యం ఇలా అన్నింటిని తాత నుంచి పుణికి పుచ్చుకున్నారు జూనియర్. తాతయ్య ఒడిలోనే నటనలో ఓనమాలు నేర్చుకున్న ఎన్టీఆర్.. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలరామాయణంలో అద్భుతంగా నటించారు. తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చి .. చదువుపై దృష్టి పెట్టారు తారక్ .
నిన్ను చూడాలని చిత్రంతో ఫుల్ లెంగ్త్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత స్టూడెంట్ నెం.1, సింహాద్రి, ఆదిలతో వరుస బ్లాక్ బస్టర్స్ కొట్టి చిన్న వయసులోనే స్టార్ డమ్ అందుకున్నారు తారక్. మధ్యలో కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో నెంబర్ గేమ్‌లో కాస్త వెనకబడ్డారు. ఈ దశలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగతో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యారు ఎన్టీఆర్. ఆ వెంటనే అదుర్స్, బృందావనం సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యారు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్‌తో ఎన్టీఆర్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఆ వెంటనే నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ , రీసెంట్‌గా దేవర పార్ట్ 1 సినిమాలతో అలరించారు. అయితే తొలినాళ్లలో బొద్దుగా ఉన్న ఎన్టీఆర్.. కంత్రీ, యమదొంగ , బాద్‌షా సినిమాలలో స్లిమ్‌గా కనిపించారు. దీంతో తారక్ వెయిట్ లాస్ కావడానికి లైపో చేయించుకున్నారని రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి.
కొన్నేళ్ల క్రితం ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ గాసిప్స్‌కు చెక్ పెట్టారు. నేను ఆపరేషన్ చేయించుకున్నాను అంటున్నారు.. కానీ తాను హైదరాబాద్‌లోనే అందరికీ కనిపిస్తున్నానని .. నేను లైపో చేయించుకుంటే ఎవరో ఒకరు లీక్ చేసేవారు కదా అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. తిండి మానేస్తే చాలు ఎవడైనా వెయిట్ లాస్ కావొచ్చని ఆయన సలహా ఇచ్చారు. ఒకప్పుడు తనకు తినడంలో సిస్టమ్ ఉండేది కాదని.. బావార్చీలో దొరికే చికెన్ బిర్యానీ నలుగురికి సరిపోతుందని కానీ తానొక్కడినే దానిని లాగించేవాడినని తారక్ సరదాగా చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











