twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణకు రివర్సైన జూనియర్ ఎన్టీఆర్!?

    By Sindhu
    |

    'అదుర్స్" సినిమా ఆడియోలో బాబాయ్ బాలకృష్ణ పెంచిన మీసాలతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళికి బాలయ్య మీసాలు తెగ నచ్చేశాయి.బాలకృష్ణ మీసాలు పెంచితే...అబ్బాయ్ ఎన్టీఆర్ ట్రిమ్ చేసిన మీసాలతో కనబడ్డాడు. ఇంతకీ ఈ మీసాల కథలోకి వెళితే ..'సింహా" ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలకృష్ణ పెంచిన మీసాలతో డిఫరెంట్ గా కనిపించనున్నాడు. ఈ ఎపిసోడ్ లోనే నయనతార పాత్ర వస్తుందని సమాచారం!

    ఇక అబ్బాయ్ విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం 'బృందావనం" చిత్రంలో నటిస్తున్నాడు. అందులోని గెటఫ్ ఇది. మీసాలను లైట్ గా ట్రిమ్ చేయించాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పొలచ్చిలో నడుస్తోంది. ఎన్టీఆర్, కాజల్ పై ఓ పాటను తెరకెక్కిస్తారు. 10 రోజులపాటు ఈ పాటను షూట్ చేస్తారు. మున్నా చిత్ర వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X