Devara: ఎన్టీఆర్ రోల్స్‌పై సంచలన లీక్.. చేసేది డుయల్ రోల్ కాదా.. దేవర క్లైమాక్స్ ట్విస్ట్ ఇదే!
తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. కొంత కాలంగా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇలా ఇప్పుడు తారక్ 'దేవర' అనే హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఇది అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్స్‌తో పాటు క్లైమాక్స్ ట్విస్ట్ కూడా లీక్ అయ్యాయి. ఆ వివరాలను మీరే చూడండి!
దేవరగా మారిన ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రమే 'దేవర'. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందించాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు నటించారు.

దేవర మూవీ సందడితో
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిన 'దేవర' మూవీని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను సైతం తీసుకు వచ్చారు. అలాగే, ఇండియా వైడ్‌గా కొన్ని ఈవెంట్లను కూడా ప్లాన్ చేశారు. దీనికితోడు ఓవర్సీస్‌లో టికెట్ల బుకింగ్ కూడా మొదలైంది. దీంతో కొద్ది రోజులుగా ఈ సినిమా సందడి కనిపిస్తోంది.
కోస్టల్ బ్యాగ్‌డ్రాప్ స్టోరీ
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన సినిమానే 'దేవర'. ఈ ప్రతిష్టాత్మక సినిమా కోస్టల్ ఏరియా నేపథ్యంతో హై ఓల్టేజ్ యాక్షన్‌తో రాబోతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ చెప్పేసింది. అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు కూడా ఉన్నాయి. ఇందులో గతంలో ఎన్నడూ చూడని వైల్డ్ యాక్షన్‌ను ప్లాన్ చేసినట్లు లీకులు వస్తున్నాయి.

ట్రైలర్‌తో డౌట్లు పెట్టి
హై రేంజ్‌లో రూపొందుతోన్న 'దేవర' మూవీ కథ గురించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కానీ, ఇటీవలే విడుదలైన ట్రైలర్‌లో దర్శకుడు చాలా విషయాలను రివీల్ చేశాడు. అదే సమయంలో కొన్ని సస్పెన్స్‌లను కూడా హైలైట్ చేశాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర సముద్రంలోకి వెళ్లి బయటకు రాకపోవడం, కొడుకు పిరికివాడు కాదని చెప్పడం చూపించాడు.
మూడో ఎన్టీఆర్ కూడా
చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటించిన చిత్రమే 'దేవర'. ఇందులో అతడు తండ్రి, కొడుకుగా డుయల్ రోల్ చేస్తున్నట్లు మొదట్లోనే సమాచారం లీకైంది. అందుకు అనుగుణంగానే ట్రైలర్‌లో సైతం ఈ విషయాన్ని రివీల్ చేసేశారు. దీంతో అతడి ద్విపాత్రాభినయం కోసం అందరూ వేచి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇందులో ఎన్టీఆర్ మూడో పాత్ర కూడా ఉందని తెలిసింది.

పార్ట్ 2పై హైప్ పెంచి
'దేవర' సినిమాలో ఎన్టీఆర్ మూడో పాత్ర కూడా చేస్తున్నట్లు తాజాగానే ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ రోల్ మూవీ క్లైమాక్స్‌లో వస్తుందని కూడా సమాచారం లీకైంది. ఇది రెండో పార్టుపై ఆసక్తిని పెంచే సస్పెన్స్‌తో ఎండ్ కాబోతుందట. అప్పుడు తారక్ 60 ఏళ్ల వృద్ధుడిగా కనిపిస్తాడని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











