మనది హిట్ పెయిర్ అంటూ జూ ఎన్టీఆర్ వెంటపడి వేదిస్తోన్న హీరోయిన్...!?

By Sindhu

గత ఏడాది వరకు చాలా సినిమాలతో బిజీగా ఉన్న ప్రియమణికి ఇప్పడు చేతిలో 'క్షేత్రం" మినాహా మరో చిత్రమే లేదు. దాంతో టెన్షన్ పడుతున్న ప్రియమణి తన స్నేహితులు, తనతో నటించిన హీరోలని వెంటాడుతూ తనకో అవకాశమివ్వమని పీడిస్తోందట..జూ ఎన్టీఆర్ తో 'యమదొంగ" చిత్రంలో నటించిన ప్రియమణి ఇప్పుడు అతడిని మరో సినిమాలో ఛాన్సిమ్మని అడుగుతోందట...

యమదొంగకి ముందు ఎన్టీఆర్ వరుస ప్లాపులతో ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. జూ ఎన్టీఆర్ కి మళ్లీ పునరత్తేజాన్ని ఇచ్చిన యమదొంగని గుర్తు చేస్తూ, తమ పెయిర్ లక్కీ అని చెబుతూ ఇంకోసారి కలిసి నటిద్దామని వెంటాడుతోందట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రంలో మొదటి హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది..ఇంకా సెకండ్ హీరోయిన్ ఖరారు కాలేదు.

దాంతో ఆ అవకాశం తనకి ఇమ్మని ప్రియమని పోరు పెడుతోందట. ఇందులో మెయిన్ హీరోయిన్ గా అయినా తనకి అవకాశమిచ్చి బ్రేకివ్వాలంటూ ప్రియమణి కోరుతోందట. అయితే ప్రస్తుతం డిమాండ్ లేని ప్రియమణి కంటే డిమాండ్ లో ఉన్న తాప్సీ లేదా దీక్షా సేథ్ అయితే బాగుంటుందనేది ఆ చిత్ర రూపకర్తల ఆలోచరనట. జూ ఎన్టీఆర్ తలుచుకుంటే ప్రియమణికి పనవుతుంది కానీ అతను తలుచుకుంటాడా అనేది అనుమానమిపుడు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X