ఎన్టీఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. మరో ఏడాది వెయిట్ చేయాల్సిందేనా?
కరోనా వైరస్ కారణంగా సినిమాల అర్థమే మారిపోయింది. వైరస్ మొదలైనప్పటి నుంచి ఇండియన్ సినిమా థియేటర్స్ మూగబోయిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది అభిమానులు వారి హీరోలను మిస్సవుతున్నారనే చెప్పాలి. నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా కాలం తరువాత వెండి తెరకు కాస్త ఎక్కువగానే దూరం అయ్యాడు. ఇక ఇప్పుడు మరో వార్త అభిమానులను మరింత కలవరపెడుతోంది.

ఏడాదికో సినిమా..
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా వెండితెరకు ఒక ఏడాది కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఒక 2009ని మాత్రమే మిస్ అయ్యాడు. కానీ ఆ తరువాత ప్రతి ఏడాదికో సినిమా రిలీజ్ చేస్తూనే అన్నాడు. వీలైనంత వరకు మంచి కథలను ఎంచుకుంటు అభిమానుల సంఖ్యను కూడా పెంచుకున్నాడు.

ఆ సినిమా తరువాత..
అయితే 2018లో అరవింద సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ కనిపించలేదు. కనీసం RRR ఫస్ట్ లుక్ అయినా వస్తుందేమో అనుకుంటే అది కూడా రిలీజ్ కాలేదు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కానుకాగా రిలీజ్ కావాల్సిన టీజర్ కరోనా వైరస్ కారణంగా క్యాన్సిల్ అయ్యింది. షూటింగ్ ఆగిపోవడంతో ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయలేమని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఫస్ట్ లుక్ మరింత ఆలస్యం..
అయితే RRRలో ఎన్టీఆర్ కొమురం భీమ్ ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ కానుంది అనే విషయంలో ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తున్నప్పటికి ఇంకా ఎవ్వరికీ సరైన అవగాహన రావడం లేదు. అయితే పరిస్థితులను బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం మరో ఏడాది వెయిట్ చేసే అవకాశం ఉందని టాక్ వస్తోంది.
Recommended Video

కాలమే నిర్ణయించాలి..
సినిమా రిలీజ్ 2021 సంక్రాంతి ఉండదని అందరికి తెలిసిన విషయమే. ఇక షూటింగ్ కూడా ఇప్పుడు మొదలయ్యే పరిస్థితి లేదు. దీంతో సమ్మర్ లో రిలీజ్ అవుతుంది అనడంలో కూడా క్లారిటీ లేదు. ఈ ఆలస్యం కారణంగా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇక వచ్చే ఏడాది మళ్ళీ తారక్ పుట్టినరోజుకే వచ్చేలా ఉందనిపిస్తోంది. ఫస్ట్ లుక్ కోసమే అంత ఆలస్యం అయితే ఇక సినిమా రిలీజ్ ఎప్పుడు వస్తుందో కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











