‘RRR’ లేటెస్ట్ అప్‌డేట్: ఆయన పుట్టినరోజున ఎన్టీఆర్ లుక్ రివీల్
Recommended Video
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'RRR'. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీం పాత్రలో, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఫ్యాన్స్‌లో నిరాశ.. రాజమౌళి నిర్ణయం
షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి లుక్స్ విడుదల చేయలేదు. దీంతో అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా ఒక పోస్టర్ విడుదల చేయాలని చిత్ర దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పనులను కూడా చేస్తున్నాడని టాక్.

ఎన్టీఆర్‌తోనే మొదలు
తమ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వాలనుకుంటున్న ‘RRR' టీమ్.. ముందుగా ఎన్టీఆర్ రోల్‌కు సంబంధించిన లుక్ రివీల్ చేయాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే కొమరం భీంగా కనిపించనున్న జూనియర్ ఎన్టీఆర్ లుక్‌ను త్వరలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఫస్ట్ సర్‌ప్రైజ్‌కు డేట్ ఫిక్స్
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ పోస్టర్‌ను అక్టోబర్ 22న విడుదల చేస్తారట. ఆరోజు కొమరం భీం జయంతి ఉండడమే దానికి కారణం అని అంటున్నారు. దీంతో నందమూరి అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. మరోవైపు, ఈ సినిమా కోసం తారక్ ఎంతగానో కష్టపడుతున్నాడు. సరైన ఫిజిక్ కోసం గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు.

ఆ విషయంలో క్లారిటీ లేదు
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. సినిమా షూటింగ్ ఆరంభంలో ఓ హాలీవుడ్ నటిని తీసుకున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. తర్వాత ఎమ్మా రాబర్ట్స్ అనే నటిని అనుకున్నారు. కానీ, అది ఫైనలైజ్ కాలేదు. ఇక, రెండు రోజుల నుంచి మరో బ్రిటన్ నటి పేరు వినిపిస్తోంది. ఇంతకీ అతడి సరసన ఎవరు నటిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











