ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీపై రూమర్లు.. కొట్టిపడేసిన యంగ్ టైగర్ వర్గాలు
గత ఐదేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్‌ను రఫాడిస్తున్నారు. టెంపర్‌తో మొదలు పెట్టిన జైత్రయాత్ర నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ వరకు కొనసాగించింది. ఇకముందు RRR, త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాలపై దృష్టిపెట్టారు. అరవింద సమేత తర్వాత అనుకోకుండా గ్యాప్ వచ్చింది. అదే క్రమంలో లాక్‌డౌన్ కూడా మరింత గ్యాప్‌ను పెంచడంతో అభిమానులు నిరాశలో మునిగిపోతున్నారు. అయితే వారికి బంపర్ బొనాంజాను అందించేందుకు యంగ్ టైగర్ సిద్దమవుతున్నాడు. ఆ వివరాలు ఏమిటంటే..

RRR మూవీతో
అరవింద సమేత బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ తన దృష్టంతా RRR మూవీపై పెట్టారు. దర్శక ధీరుడు రాజమౌళి, రాంచరణ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా షూట్‌ను త్వరగా పూర్తి చేయాలనే తొందరలో ఉన్నారు. ఎందుకంటే అరవింద సమేత తర్వాత మరో సినిమా ప్రేక్షకులు, అభిమానుల ముందుకు రావడానికి చాలా గ్యాప్ రావడమే అందుకు కారణం.

త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో అయిననూ హస్తినకు
టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. అరవింద సమేత లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జతకట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే కరోనావైరస్ లాక్‌డౌన్ తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా స్క్రిప్టు వర్క్ పూర్తిస్థాయిలో కొనసాగుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు అయిననూ పోయి రావలే హస్తినకు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

బాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్
అయితే ఇలా సినిమాలతో ముందుకెళ్తున్న ఎన్టీఆర్ ఎన్నడూ పక్క భాషా చిత్రాల్లో నటించాలని గానీ.. తన మార్కెట్‌ను పూర్తిస్థాయిలో వివిధ భాషల్లోకి తీసుకెళ్లాలనే విషయంపై ఎన్నడూ మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ తాజాగా ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

సంజయ్ లీలా భన్సాలీతో పిరియాడిక్ మూవీ
సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న వార్త ప్రకారం.. బాలీవుడ్‌లో అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించే సినిమాలో నటించే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. చారిత్రాత్మక నేపథ్యంగా తెరకెక్కే ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారని ఆ వార్త సారాంశం. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ కీలక పాత్రను పోషిస్తున్నారని, ఆ పాత్ర తీరు తెన్నులు ప్రతీనాయక పాత్రను పోలీ ఉంటాయనే వార్త చక్కర్లు కొడుతున్నది. అయితే ఈ వార్తను యంగ్ టైగర్ పీఆర్ వర్గాలు కొట్టిపడేశాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు.


Click it and Unblock the Notifications










