‘జై లవ కుశ’ యూనిట్‌కు మరో షాక్.... స్టోరీ కూడా లీక్?
ఎన్టీఆర్ మూవీ ‘జై లవ కుశ’ స్టోరీ లీకైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ కథ చక్కర్లు కొడుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'జై లవ కుశ' చిత్రానికి సంబంధించి లీకుల పర్వం కొనసాగుతోంది. ఆ మధ్య 'జై' టీజర్ విడుదల ముందు లీక్ అవ్వగా.... రెండు రోజుల క్రితం రావణ అనే సాంగ్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజాగా 'జై లవ కుశ' చిత్రానికి సబంధించిన స్టోరీ లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ లీక్ అయిన స్టోరీ వింటుంటే..... నమ్మే విధంగానే ఉంది. మరి ఇదే రియల్ స్టోరీనా? లేక సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన ఫేక్ స్టోరీనా? అనేది తేలాల్సి ఉంది.

మూడు పాత్రల్లో ఎన్టీఆర్
‘జై లవ కుశ'లో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ముఖ్యమైన పాత్ర ‘జై' . ఇప్పటికే విడుదలైన టీజర్ బట్టి చూస్తే ఇది విలనిజంతో కూడుకున్న పాత్ర అని తెలుస్తోంది. మిగతా లవ, కుశ పాత్రలు సాధారణ పాత్రలు.

ఒకే తల్లి బిడ్డలు కాదు
ఈ మూడు పాత్రల్లో లవ, కుశ కవల పిల్లలు. ఈ ఇద్దరు కవలల పెద్దన్న జై. మొదటి భార్యకు పుట్టిన వ్యక్తి జై అయితే, తన తండ్రి రెండో భార్యకు పుట్టిన వాళ్లే లవ కుశ.
Recommended Video


తండ్రిపై కక్ష
జై తల్లి చనిపోతుంది. ఆమె చావుకు కారణం తన తండ్రే అని భావించిన జై, తన తండ్రితో పాటు తమ్ముళ్లు లవ, కుశలను అంతం చేసేందుకు కంకణం కట్టుకుంటాడట. తల్లిపోయిన తర్వాత జై ఇంటినుండి వెళ్లిపోయి చెడు సావాసాలు చేసి పెద్ద రౌడీగా మారుతాడట.

జై వర్సెస్ లవ, కుశ
ఈ క్రమంలో జై వర్సెస్ లవ, కుశ మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని.... యాక్షన్, కామెడీ అన్ని కలగలిపి ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ ఆసక్తికరంగా తెరకెక్కించాడని అంటున్నారు. మరి ఈ కథ, నిజమో? కాదో? తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











