హాట్ టాపిక్ : “భయ్యా” గా ఎన్టీఆర్
హైదరాబాద్ : త్వరలో ఎన్టీఆర్ "భయ్యా" గా కనిపించనున్నాడా...అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అహనా పెళ్లంట, పూలరంగడు చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వీరభద్ర చౌదరి ఈ చిత్రం డైరక్ట్ చేయనున్నాడని వినికిడి.
నాగార్జునతో ప్రస్తుతం భాయ్ చిత్రం చేస్తున్న వీరభద్రమ్ రీసెంట్ గా...ఎన్టీఆర్ కు ఓ స్క్రిప్టు చెప్పాడని, లైన్ నచ్చి ఓకే చేసాడని సమాచారం. ఆ చిత్రానికి భయ్యా అనై టైటిల్ పెడుతున్న ట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రెండు సినిమాలు చేస్తున్నారు. ఒకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో రామయ్య వస్తావయ్యా చిత్రం. మరొకటి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే రభస చిత్రం. ఈ రెండు చిత్రాలు యాక్షన్ ఎంటర్టైనర్స్ కావటం విశేషం.
శ్రీను వైట్లతో కలిసి చేసిన బాద్షా చిత్రం ఊహించని విధంగా విజయవంతం కాకపోవటంతో ఎన్టీఆర్ ఆచితూచి స్టెప్స్ వేస్తున్నాడని అంటున్నారు. ఈ నేపధ్యంలో వీరభద్రం చిత్రానికి పూర్తిస్ధాయి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications












