జూ ఎన్టీఆర్ తో అనుకున్న ఆ భారీ ప్రాజెక్టు ఆగినట్లే!!
జూ ఎన్టీఆర్ తో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా 'పాతాళభైరవి' రీమేక్ చేద్దామని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల డిస్కషన్ అనంతరం దీన్ని ఆపువేశినట్లు తెలుస్తోంది. అనుకున్న బడ్జెట్ కీ,మార్కెట్ కీ చాలా గ్యాప్ ఉండటంతో ఈ ప్రాజెక్టుని అటకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ స్క్రిప్టులో చెప్పిన మార్పులు కూడా ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాకపోవటానికి ఓ కారణం అని చెప్తున్నారు. ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి 'అరుంధతి' వంటి భారీ విజయం సాధించిన చిత్రం తర్వాత ఇప్పటివరకూ ఏ చిత్రమూ ప్రారంభించలేదు. తమ గ్రాఫిక్ డిజైనర్ రాహుల్ నంబియార్ ని డైరక్ట్ చేద్దామని ప్రయత్నించి అనుకున్న కథ కుదరక ఆ ప్రయత్నం ఆపు చేసారు. అలాగే ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన 'బృందావనం' రేపు(13-10) రిలీజ్ అవుతోంది. కాజల్,సమంత నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఎన్టీఆర్ బృందావనం పాతాళ భైరవి అదుర్స్ రీమేక్ విజయాసంస్ధ కె.వి.రెడ్డి ntr brindavanam patalabhairavi adurs remake vijaya kv reddy


Click it and Unblock the Notifications