జూ ఎన్టీఆర్ టీవీ ఛానల్‌కు సాఫ్ట్ వేర్ ప్రాబ్లం..!
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ 24/7 ఎంటర్‌టైన్మెంట్ ఛానల్ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు గత కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. 2012 జనవరిలోనే ఆ చానల్ లాంచ్ చేసే అవకాశం ఉందని కూడా అప్పట్లో చర్చించుకున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం.....ఈ నెలలో ఛానల్ లాంచ్ చేయాలనే ఆలోచనను జూ ఎన్టీఆర్ విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం టెక్నికల్ విభాగంలో ఉపయోగించే సాఫ్ట్ వేర్ సమస్యలు సాల్వ్ కాక పోవడంతో మరికొంత కాలం చానల్ లాంచ్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి జూ ఎన్టీఆర్ తన మామ నార్నె శ్రీనివాస రావు సహాయం తీసుకుంటున్నట్లు చర్చించుకుంటున్నారు. స్టూడియో ఎన్ ఛానల్ అధిపతి అయిన శ్రీనివాసరావుకు ఇలాంటి విషయాల్లో చాలా అనుభవం ఉన్న సంగతి తెలిసిందే.
నారా లోకేష్ చేతిలో ఉన్న స్టూడియో ఎన్ ఛానల్ ను జూ ఎన్టీఆర్ ఇటీవల తన వర్గం చేతుల్లోకి తెచ్చుకున్నారని, ఎంటర్ టైన్మెంట్ ఛానల్ కూడా ఉంటే మీడియాపై తనకు పూర్తి పట్టు వచ్చి తన సినీ భవిష్యత్ తో పాటు, మున్ముందు తాను రాజకీయాల్లో అడుగిడే అవకాశం ఉన్నందున ఉపకారిగా ఉంటుందనేది ఆయన ఆలోచన అని....కొందరు అంటున్నారు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'దమ్ము' చిత్రంలో నటిస్తున్నాడు. త్రిష, కార్తీక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం పూర్తి మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











