గుంటూరులో ఎన్టీఆర్ ‘టెంపర్’ ఫిక్స్?

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న ‘టెంపర్' మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లో కాకుండా గుంటూరులో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. త్వరలోనే ఆడియో విడుదల డేట్ ప్రకటించి ఈ విషయమై అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

టెంపర్' చిత్రం ఫస్ట్ లుక్ ఫోటోస్ ఈ రోజు ఇంటర్నెట్లో లీకై హల్ చల్ చేస్తున్నాయి. సిక్స్ ప్యాక్ బాడీతో ఎన్టీఆర్ గత సినిమాలకు భిన్నంగా కనిపిస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ భార్య పోని వర్మ ఈ ఫోటోలు లీక్ చేసారు. ఎడిటింగ్ రూంలో నుంచే ఈ ఫోటో పెడుతున్నట్లు ట్విట్టర్ లో పెర్కొంది.

పూరి జగన్నాథ్ తన సినిమాలో హీరోలను భిన్నంగా, తనదైన మార్కు కనిపించేలా స్టైలిష్‌గా చూపిస్తారు. తాజాగా ‘టెంపర్' చిత్రంలో తనదైన మార్కుతో జూ ఎన్టీఆర్‌ను ప్రజంట్ చేసాడు పూరి. తాజాగా ఇంటర్నెట్లో లీకైన జూ ఎన్టీఆర్ ఫోటోలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

Jr NTR's Temper Audio Function In Guntur?

తాజాగా విడుదలైన జూ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటోలు అభిమానులు తెగ ఆకట్టుకుంటున్నాయి. వాస్తవానికి ఈ చిత్రం ఫస్ట్ లుక్ నవంబర్ 29న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమచారం. అయితే అంతకంటే ముందుగానే ఫోటోలు బయటకు లీక్ చేసారు ప్రకాష్ రాజ్ భార్య పోనీ వర్మ.

యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు.

కెనిడయన్ మోడల్ అయిన నోరా ఫటేహి ఈ చిత్రంలో ఐటం సాంగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తూండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X