జూ ఎన్టీఆర్ అందుకే టెన్షన్ పడుతున్నారా?
జూనియర్ ఎన్టీఆర్ తాను హీరోగా నటించిన 'బృందావనం' చిత్రం విడుదలపై ఆందోళనపడుతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ చిత్రం విడుదలైన తర్వాత హింసాత్మక సంఘటనలు జరగవచ్చని ఆయన కంగారుపడుతున్నాడని చెప్తున్నారు. ఆ ఆందోళనకు కారణం..తెలంగాణ ప్రాంతంలో ఆ చిత్ర ప్రదర్శనను అడ్డుకోవచ్చనేది అని తెలియవస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఎన్టీఆర్ కలిసినట్టు సమాచారం. 'బృందావనం' చిత్ర ప్రదర్శనకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడటానికి టిడిపి కార్యకర్తలను పంపిస్తానని ఎన్టీఆర్‌కు చంద్రబాబు హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు. అదుర్స్ చిత్రం సమయంలోనూ చెదురు మదురుగా తెలంగాణ ప్రాంతాల్లో ఆందోళనకర సంఘటనలు జరిగాయి. అయితే ఈ చిత్రానికి మరో ప్లస్ ఉంది..దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు ఇద్దరూ తెలంగాణా కి చెందినవారే కావటం. ఇక బృందావనం చిత్రం అక్టోబర్ ఎనిమిదిన అంతటా రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











