హోల్డ్ లో పెట్టిన ఎన్టీఆర్ చిత్రం టైటిల్
హైదరాబాద్: జూ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ ఏమిటన్నది అభిమానుల్లో చాలా ఆసక్తిగా ఉంది. అయితే ఈ టైటిల్ ని హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ వరసగా చిత్రాలు కమిటవుతున్నారు. ఏ టైటిల్ ఏ దర్శకుడుతో చేసేది అనేది ఫ్యాన్స్ లో కన్ఫూజ్ కాకుండా చూసేందుకు కొద్ది రోజులు ఆగి టైటిల్ ని ప్రకటించనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా బాద్షా పూర్తైన తర్వాత తమ టైటిల్ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ తో పాటే చిత్రం ప్రమోషన్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.
ఇక ఈ చిత్రం ఓ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. హీరోయిన్ గా సమంత చేస్తోంది. వీరిద్దరి మధ్యన వచ్చే సీన్స్ కొత్తగా ఉంటాయని,ముఖ్యంగా డైలాగులు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. అలాగే పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఈ లవ్ స్టోరీ స్క్రిప్టుని హరీష్ శంకర్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్,సమంత కాంబినేషన్ లో వచ్చిన బృందావనం హిట్ కావటంతో ఈ కాంబినేషన్ పై మరింత అంచనాలు పెరుగుతాయి. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కు సరిపోయే ఓ విభిన్నమైన మాస్ ఎంటర్‌టైనర్ కథను హరీష్ సిద్ధం చేశాడని చెప్తున్నారు. ఈ కథను విన్న వెంటనే మరో మాట లేకుండా ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది.
ముఖ్యంగా మాస్ కి నచ్చే ఎలిమెంట్స్ అన్ని హరీష్ కూర్చి ఈ కథను జన రంజకంగా తెరకెక్కించనున్నాడని టాక్. గబ్బర్ సింగ్ తో తన స్టామినా ఏమిటో ప్రూవ్ చేసుకున్న హరీష్ ఈ చిత్రంతో తెలుగులో తిరుగులేని దర్శకుడుగా ఎదుగుతాడంటున్నారు. మరో ప్రక్క గతంలో ఎన్టీఆర్ తో బృందావనం వంటి హిట్ చిత్రం తీసిన దిల్ రాజు ఈచిత్రానికి నిర్మాత కావడం సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











