జూ.ఎన్టీఆర్ ..వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు

By Srikanya

హైదరాబాద్ : తన చిత్రం టెంపర్ హడావిడిలో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు వీలుచూసుకుని ఓ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారని సమాచారం. తన సోదరుడు కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న "పటాస్" కి సినిమా ప్రారంభంలో వచ్చే విజువల్స్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ వాయిస్ ఓవర్ తో చిత్రానికి మరింత క్రేజ్ వస్తుందని, నందమూరి సోదురులు కలిపి చేస్తున్న ప్రాజెక్టుగా ఉండిపోతుందని భావిస్తున్నారని తెలుస్తోంది. అటు టెంపర్‌లోనూ ఇటు పటాస్‌లోనూ ఇద్దరూ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గెటప్‌లో కనిపిస్తుండడం విశేషం.

https://www.facebook.com/TeluguFilmibeat

నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న 'పటాస్‌' చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమా గురించి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ 'రొమాంటిక్‌ , యాక్షన్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకొంది. సాయికార్తీక్‌ మంచి సంగీతాన్ని అందించారు. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని తెలిపారు.

Jr.NTR's voice over to Pataas

కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ''యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. కథలో వినోదానికీ చోటుంది. భారీ హంగులతో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరిస్తుంది'' అన్నారు. శ్రుతి సోధి పంజాబీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది శ్రుతి. అటు అందంగా కనిపించడంతోపాటు ఇటు నటనలోనూ రాణిస్తోంది. చిత్రంలో కల్యాణ్‌రామ్‌ పోలీసు అధికారిగా కనిపిస్తారు. కథలో మలుపులు రక్తికట్టించేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.

సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: సర్వేశ్‌ మురారి, సంగీతం: సాయి కార్తిక్‌, ఎడిటింగ్‌: తమ్మిరాజు, ఆర్ట్‌: ఎం.కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: పటాస్‌ వెంకట్‌, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్‌, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X