మొత్తానికి బోయపాటికి ఓకే అయ్యింది
వరస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణకు సింహా వంటి సూపర్ హిట్ ఇచ్చి మరో సారి పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ఆ తర్వాత ప్రాజెక్టు వెంటనే ఓకే చేయించుకోలేకపోయారు. ఎన్టీఆర్ పిలిచి మరీ సినిమా ఇస్తానన్నా బోయపాటి ఇప్పటివరకూ కథ ని చెప్పి ఒప్పించుకోలేకపోయారు. మరో ప్రక్క చిరంజీవి 150వ చిత్రానికి బోయపాటినే దర్శకుడుగా ఎంచుకున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. దాంతో ఎన్టీఆర్ చిత్రం అటకెక్కినట్లే అనుకున్నారు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ రీసెంట్ గా బోయపాటి చెప్పిన లైన్ ని ఓకే చేసాడని, అయితే ప్రస్తుతం తాను చేస్తున్న రచ్చ, శక్తి చిత్రాలు పూర్తయ్యాకే ఈ చిత్రం మొదలెడదామని, అప్పటికి ఈ చిత్రం స్క్రిప్టు పూర్తి చేసుకోమని చెప్పాడని సమాచారం. ఇక ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్లు ప్యామిలీ ఎమోషన్స్ ని కలుపుతూ బోయపాటి ఈ స్క్రిప్టుని తన రైటర్స్ ని కూర్చోపెట్టి వండుతున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ మ్యారేజ్ గిఫ్ట్ గా ఈ చిత్రం రానుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సి.సి.ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











